వీడియోకాన్‌కు రూ.3,250 కోట్ల రుణం మంజూ రు వ్యవహారంలో ఐసిఐసిఐ బ్యాంక్ సిఇఒ, ఎండి చందా కోచర్ కుటుంబం అనుచిత లబ్ధి పొందిందన్న ఆరోపణలపై తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దర్యాప్తు ప్రారంభించింది. వీడియోకాన్ గురించి సమాచారాన్ని కోరు తూ క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి ‘సెబి’కి ఇడి లేఖ రాసినట్లు తెలుస్తోంది. గ్రూపు కార్యకలాపాలపై గడిచిన కొన్నేళ్లలో సెబి జరిపిన దర్యాప్తునకు సంబంధించిన పత్రాలను ఇవ్వాలని కోరింది. అలాగే, వీడియోకాన్‌తో లావాదేవీలకు సంబంధించి ఐసిఐసిఐ బ్యాంక్ ఇప్పటివరకు బహిర్గతం చేసి న వివరాలను కోరుతూ దర్యాప్తు ఏజెన్సీ ఆర్బిఐని సైతం సంప్రదించనుంది. ఈ రుణవివాదంపై ఇప్పటికే ప్రాథమిక విచారణను ప్రారంభించిన సిబిఐ.. శనివారంఐసిఐసిఐ బ్యాంక్ నోడల్ అధికారులను ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇక చందా కోచర్‌ను పిలువడమే తరువాయని సమాచారం. వీడియోకాన్‌కు రుణ మంజూరు సమయంలో పాటించిన నిబంధనలు, విధానాలపై అవగాహనకు రావడంతోపాటు ఈ వ్యవహారంలో ఆమె భర్త ఏమైనా లబ్ధి పొందారా అని ప్రశ్నించేందుకే చందా కోచర్‌ను పిలువనున్నట్లు సిబిఐ అధికార వర్గాలు తెలిపాయి.