విజయవంతంగా కార్టూనిస్ట్ విశ్వపతితో టాంటెక్స్ సదస్సు


ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో శీలం కృష్ణవేణి అధ్యక్షతన ఆదివారం నాడు స్థానిక ఎస్.పి.ఆర్ . బాంక్వెట్ హాల్ లో, కార్టూన్ వర్క్ షాప్ నిర్వహించారు. ప్రముఖ కార్టూనిస్ట్ టి.వి.ఆర్.కే.మూర్తి(విశ్వపతి) కార్టూన్లు చిత్రించడంపై పలు విలువైన సూచనలు చేశారు. విశ్వపతి పేరుతో ప్రసిద్ధులైన మూర్తి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రికలో 1984 నుంచి 1990 దాకా SUMFUN శీర్షికలో కార్టూన్స్ వేశారు. ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి వంటి ప్రముఖ పత్రికలలో అయిదు వేలకు పైగా కార్టూన్లు వేశారు. సంస్థ పూర్వధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం విశ్వపతిని సభకు పరిచయం చేయగా, విశ్వపతి పాల్గొన్న వారందరికీ కార్టూన్స్ గురించి తన అనుభవాలు జోడిస్తూ, రకరకాల బొమ్మలు ఎలా గీయవచ్చో వివరించారు. అత్యుత్తమ చిత్రాలు గీసిన ముగ్గురికి విశ్వపతి తను వ్రాసిన Sincerely Yours పుస్తకాలను బహుమతిగా అందజేశారు. ప్రముఖుల వ్యంగ చిత్రాలను(Caricatures) టాంటెక్స్ కార్యవర్గ సభ్యులకు బహుకరించారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షురాలు శీలం క్రిష్ణవేణి ఉత్తరాధ్యక్షుడు వీర్నపు చినసత్యం విశ్వపతిని శాలువ, జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో టాంటెక్స్ మాజీ అధ్యక్షుడు ఉప్పలపాటి కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడు కోడూరు క్రిష్ణారెడ్డి, కార్యదర్శి మండిగ శ్రీలక్ష్మి, కోశాధికారి పాలేటి లక్ష్మి, కార్యవర్గ సభ్యులు బండారు సతీష్, ఇల్లెందుల సమీర తదితరులు పాల్గొన్నారు.








More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com