విజయవాడ నర్తకికి యునెస్కో ఆహ్వానం


విజయవాడకు చెందిన ప్రముఖ కూచిపూడి నర్తకీమణి అచ్యుత మానసకు యునెస్కో అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్‌ డ్యాన్స్‌ కౌన్సిల్‌ నుంచి ఆహ్వానం అందింది. దీనిలోభాగంగా ఈ నెల 4 నుంచి 8 వరకు గ్రీస్‌లోని ఏథెన్స్‌లో జరుగనున్న 51వ అంతర్జాతీయ నృత్య సమ్మేళనంలో ఆమె ప్రదర్శన ఇవ్వనున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన సుమారు 400 మంది శాస్త్రీయ నృత్య కళాకారులు హాజరుకానున్న ఈ వేడుకల్లో కూచిపూడి నృత్య ప్రదర్శన చేయడానికి ఆహ్వానం అందుకున్న తొలి తెలుగు అమ్మాయి(తెలుగు రాష్ట్రాల్లో) మానస కావడం విశేషం. నృత్యప్రదర్శనతో పాటు కూచిపూడి నృత్య విశేషాలతో కూడిన ఛాయాచిత్ర ప్రదర్శన, ‘కూచిపూడి నృత్యంలో తరంగం’ అంశంపై కార్యశాల కూడా ఆమె నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆమె మాట్లాడుతూ.. ఏథెన్స్‌ ప్రదర్శనలో తరంగం అంశంతో పాటు ‘వందేమాతరం’ అంశాన్ని కూడా ప్రదర్శించనున్నట్లు చెప్పారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com