విద్యాభ్యాసానికి లండన్ ప్రీతిపాత్రమైనది

విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాల్లో లండనే బెస్ట్‌ అట. క్యూఎస్‌ వరల్డ్‌ ఇంటర్నేషనల్‌ ర్యాంకింగ్స్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో విద్యార్థులకు చదువుకోడానికి లండనే బెస్ట్‌ నగరమని తేలింది. గతేడాది అగ్రస్థానంలో మాంట్రియల్‌ నగరం ఉంది. ఈ ఏడాది ఆ స్థానాన్ని యూకే రాజధాని అధిగమించింది. విద్యార్థులు ఎక్కువగా ఏ దేశంలోని యూనివర్శిటీల్లో చదువుకునేందుకు మొగ్గు చూపుతున్నారు? ఆ దేశంలో జీవనశైలి ఎలా ఉంది? వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని సర్వే నిర్వహించారు. అన్ని విధాలుగా విద్యార్థులకు సౌకర్యంగా ఉండే దేశం లండన్ అని పరిశోధనలో తేలింది. లండన్‌లో అన్ని విధాలుగా ఎంతో సౌకర్యంగా ఉంటుందని దాదాపు 50వేల విద్యార్థులు వెల్లడించారట. అంతేకాదు లండన్‌లో చదువుకుంటున్న విద్యార్థులు గ్యాడ్రుయేషన్‌ పూర్తయ్యాక కూడా అక్కడే స్థిరపడాలని అనుకుంటున్నారు. ఎందుకంటే చదువు పూర్తయ్యాక వారి అర్హతల మేరకు వెంటనే ఉద్యోగం లభించే అవకాశాలు అక్కడ ఎక్కువగా ఉంటాయి. యూకేలోని యూనివర్శిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌, ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆకర్షణీయంగా ఉండటం కూడా లండన్‌ అగ్రస్థానంలో ఉండడానికి ఒక కారణం. అయితే అన్ని విషయాల్లో లండన్‌ బెస్ట్‌ అయినా.. విద్యార్థులకు ఇల్లు అద్దెకు తీసుకోవడం వంటివి మాత్రం కష్టంగా ఉంటాయి. ఎందుకంటే లండన్‌ అత్యంత ఖరీదైన దేశం. కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ పరంగా చూస్తే ఈ దేశం 113వ స్థానంలో ఉంది.

విద్యార్థులకు బెస్ట్‌ టాప్‌ టెన్‌ నగరాలు:‌
లండన్‌
టోక్యో
మెల్‌బోర్న్‌
మాంట్రియల్‌
పారిస్‌
మ్యునిచ్‌‌
బెర్లిన్‌
జ్యురిచ్‌
సిడ్నీ
సియోల్‌

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com