విపరీతమైన దగ్గుతో సమాధానం ఇస్తోన్న జయలలిత-ఆడియో!

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత చివరి వాయిస్‌ రికార్డుకు సంబంధించిన 52 సెకన్ల ఆడియోను అరుముగ స్వామి కమిషన్‌ విడుదల చేసింది. ఈ కమిషన్‌ జయ మృతికి గల కారణాలపై విచారణ జరుపుతోంది. ఈ ఆడియో రికార్డును మాజీ ముఖ్యమంత్రి వ్యక్తిగత ఫిజీషియన్, శశికళ బంధువు డాక్టర్ శివకుమార్ కమిషన్‌కు సమర్పించారు. ఆ ఆడియోలో జయలలిత వైద్యుడితో సంభాషిస్తున్నారు. ‘మీ బీపీ స్థాయి 140/80 ఉంది. మీకు రక్తపోటు చాలా ఎక్కువగా ఉందని డాక్టర్‌ జయతో చెప్పగా, ఏం కాదు ఇది నాకు సాధారణమే అని సమాధానం ఇచ్చారు’ అని ఒక ఆడియోలో రికార్డైంది. మరో ఆడియోలో ఆమె విపరీతంగా దగ్గుతూ వైద్యుడికి సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఆమె మరణించిన ఏడాదిన్నర తరవాత విడుదలైన ఈ ఆడియోలను బట్టి ఆమె వైద్యం తీసుకొనే సమయంలో స్పృహలోనే ఉన్నట్లు వెల్లడవుతోంది. జయలలిత ఆసుప్రతిలో చేరక ముందు ఆమె స్వదస్తూరితో రాసుకొని, అనుసరిస్తోన్న డైట్ ప్లాన్‌ను కూడా కమిషన్‌ విడుదల చేసింది. తూత్తుకుడి ఘటన నేపథ్యంలో ఈ ఆడియోను విడుదల చేయడంతో విమర్శలు చెలరేగుతున్నాయి. ఆ ఘటనను నుంచి పక్కదారి పట్టించడానికే ఈ ఆడియోను విడుదల చేశారని డీఎంకే ఆరోపిస్తోంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com