విమానయాన చార్జీల పెంపు

విమానయాన టిక్కెట్‌ ధరలు మరింత పెరిగే సూచనలు ఉన్నాయి. ఇప్పటికే మే 30 నుంచి ఇండిగో సంస్థ ప్రతి దేశీయ ప్రయాణ టిక్కెట్‌పై రూ.400 వరకు ఇంధన సర్‌ఛార్జిని వసూలు చేస్తోంది. ఇదే బాటలో మరిన్ని విమానయాన సంస్థలు పయనించనున్నాయి. విమానయాన రంగంలో 35-50శాతం వరకు ఇంధన ఖర్చే ఉంటుంది. దీంతోపాటు విమానయాన సంస్థలు మొత్తం తమ ఖర్చులను డాలర్లలోనే చెల్లించాల్సి ఉంటుంది. వీటిల్లో నిపుణుల జీతాలు, విమానాల సర్వీసింగ్‌, కొత్త విమానాల కొనుగోలు, ఇంధన కొనుగోళ్లు వంటివి డాలర్లలోనే జరుగుతాయి. దీంతోపాటు ధరల్లో వచ్చే మార్పులను ప్రయాణికులపై తరచూ బదిలీ చేయలేని పరిస్థితి. ఇప్పటికే స్పైస్‌ జెట్‌ సంస్థ పెరుగుతున్న ఖర్చులను ప్రయాణికులకు బదిలీ చేసే అంశాన్ని పరిశీలించింది. కానీ ఇప్పటి వరకు ఒక నిర్ణయానికి మాత్రం రాలేదన్నారు. స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయిన మూడు కంపెనీల్లో స్పైస్‌జెట్‌, ఇండిగో మాత్రమే మార్చి త్రైమాసికానికి లాభాలను ప్రకటించాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌ మాత్రం నష్టాల నుంచి బయటపడలేదు. కానీ ఈ సంస్థ టిక్కెట్‌ ధరల పెంపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. నిర్వహణ ఖర్చలు తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఈ సంస్థ సీఎఫ్‌వో అమిత్‌ అగర్వాల్‌ తెలిపారు. కాకపోతే ఆదాయాన్ని పెంచుకొనే మార్గాలు, వ్యూహాలపై చర్చిస్తున్నట్లు తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com