శంకర్ దర్శకత్వంలో విడుదలైన ‘బాయ్స్’ చిత్రం ద్వారా ప్రేక్షకులను ఆకర్షించిన నటుడు సిద్ధార్థ్. తర్వాత ‘జిగర్దండా’, ‘ఎనక్కుళ్ ఒరువన్’ తదితర చిత్రాల్లో నటించారు. తెలుగులోనూ మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం మలయాళ చిత్రసీమకు ఆయన పరిచయం కానున్నారు. మలయాళ హీరో దిలీప్ ప్రధాన పాత్రతో తెరకెక్కుతున్న ‘కమ్మర సంభవం’లో ప్రతినాయకుడిగా సిద్ధార్థ్ నటిస్తున్నారు. ఇందులో ఆయన క్యారెక్టరు హీరోకు ధీటుగా ఉంటుందని సమాచారం. అందుకే ఆ క్యారెక్టరులో నటించడానికి సిద్ధార్థ్ సమ్మతించారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ చిత్రం తుది దశలో ఉండగా, విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. మలయాళ చిత్రసీమలోనూ ఈ చిత్రం ద్వారా తన అదృష్టాన్ని సిద్ధార్థ్ పరీక్షించుకోనున్నారు.