విశాఖ చిన్నోడు-పదో తరగతి చదివాడు. వాట్సాప్ పోటీగా యాప్ తయారు.

విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఆదుర్తి సూర్యచంద్రపవన్‌ ‘పవన్‌ మెసెంజర్‌’ యాప్‌ రూపాందించి ప్రతిభ చూపాడు. పవన్‌ ఆరో తరగతి నుంచే అంతర్జాలాన్ని వినియోగించుకుని వివిధ ప్రోగ్రామ్స్‌ను శిక్షణ లేకుండానే నేర్చుకున్నాడు. అదే ఆసక్తితో చరవాణిలోని వాట్సాప్‌ మాదిరిగా ఓ యాప్‌ రూపకల్పన చేశాడు. ఈ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌లోని డెవలెపర్‌ కన్సల్టెన్సీకి పెట్టడానికి అనుమతి తప్పనిసరి కావడంతో…ముందుగా వివరాలు రిజిస్టర్‌ చేసుకుని అప్‌లోడ్‌ చేశాడు. టెలిగ్రామ్‌ ఆర్గనైజేషన్‌ అంతర్జాలంలో ఉంచిన నెట్‌ సర్వీసుతో ఈ యాప్‌ పనిచేస్తుంది.
యాప్‌లోని సౌకర్యాలు
* గ్రూపు చాటింగ్‌, ఛానల్‌ క్రియేటివ్‌
* చాట్‌బ్లౌజ్‌గ్రౌండ్‌ మార్చుకునే వెసులుబాటు * కాలింగ్‌ సదుపాయం
* ఎలాంటి ఫైల్స్‌నైనా వేగంగా పంపించే సౌలభ్యం
* వీడియోను కంప్రస్‌ చేసి పంపించే సౌకర్యం
* వాట్సాప్‌లో మాదిరి స్టిక్కర్స్‌ ఉంటాయి
* సామాన్యులకు కూడా సులువుగా అర్థమయ్యే రీతిలో రూపకల్పన
* గూగుల్‌ ప్లేస్టోర్‌లో ఉచితంగాపవన్‌మెసెంజర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com