విశాఖ భాజపా శ్రేణులకు చురకలంటించిన గడ్కరీ

భాజపా కార్యకర్తలపై కేంద్ర జలవనరులు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఆగ్రహం వ్యక్తంచేశారు. విశాఖ ఏయూ కన్వెన్షన్‌ హాలులో జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. సీఎం చంద్రబాబు, గడ్కరీ పాల్గొన్న కార్యక్రమంలో పలువురు భాజపా కార్యకర్తలు మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. దీంతో వారిపై గడ్కరీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ కార్యక్రమంలో ఈవిధంగా వ్యవహరించడం సరికాదన్నారు. నినాదాలు చేసిన వారు బయటకు వెళ్లాలని సూచించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com