వీరు జైసా నహి హేయ్ హం

ఓపెనర్‌గా బరిలోకి దిగి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌. డాషింగ్‌ ఓపెనర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి ఆటగాడితో తనని పోల్చవద్దని కోరుకుంటున్నాడు యువ ఆటగాడు మయాంక్‌ అగర్వాల్‌. విజయ్‌ హజారే టోర్నీలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన మయాంక్‌ ఏకంగా 723 పరుగులు సాధించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. దీంతో అందరూ అతన్ని సెహ్వాగ్‌తో పోల్చడం మొదలుపెట్టారు. దీనిపై అతడు తాజాగా స్పందించాడు. ‘ఒకరితో పోల్చుకునే స్థాయికి నేను ఇంకా రాలేదు. దయచేసి నన్ను వీరేంద్ర సెహ్వాగ్‌తో పోల్చకండి. సెహ్వాగ్‌ ఓ దిగ్గజ ఆటగాడు. నన్ను అతనితో పోల్చడం సరికాదు. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో నేను కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. అదృష్టవశాత్తూ ఇదే ఫ్రాంఛైజీకి సెహ్వాగ్‌ మెంటార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. కాబట్టి అతడి నుంచి నేను విలువైన సలహాలు పొందుతాను. సెహ్వాగ్‌ బ్యాటింగ్‌ చేసే తీరు చూడటం అంటే నాకు చాలా ఇష్టం. స్పిన్నర్లను ఎదుర్కొనే శైలి నాకు ఇంకా బాగా నచ్చుతుంది. మానసికంగా దృఢంగా ఎలా ఉండాలి, గేమ్‌ను ఎలా ఎంజాయ్‌ చేయాలో సెహ్వాగ్‌ నుంచి నేర్చుకుంటా. భవిష్యత్తులో ఇది నాకు ఎంతో ఉపయోగపడుతుంది’ అని మయాంక్‌ తెలిపాడు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com