వెంట్రుకతో సమానం

ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఆసక్తికరమైన రాజకీయ పోరాటంలో ఎవరూ వెనుకకు తగ్గడం లేదు. భాజపా తెదేపా నాయకులు ఒకరిపై ఒకరు ప్రకటనల యుద్ద చేసుకుంటూనే ఉన్నారు. రాష్ట్ర క్యాబినెట్ లో పొత్తులో భాగంగా మంత్రిగా ఉన్న దేవాదాయ శాఖామంత్రి మాణిక్యాలరావు మంత్రి వర్గం నుండి వైదొలగడానికి సిధంగా ఉన్నట్లు ప్రకటించారు. తెదేపాతో పొత్తు వెంట్రుకతో సమానమని ఆయన బాష్యం చెప్పారు. మేము వెంట్రుకను బండరాయికి ముడివేశాం.వస్తే బండరాయి వస్తుంది లేకుంటే వెంట్రుక పోతుంది. వారికీ మాత్రం బోడి గుండవుతుంది. అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. మార్చి నెలలో రాయలసీమకు భాజపా జాతీయ అద్యక్షుడు అమిత్ షా రానున్నారని మంత్రి చెప్పారు. మంత్రి పదవికి రాజీనామా చేసిన లేఖను పదిరోజుల కిందటే తన వ్యక్తిగత కార్యదర్శికి అందచేసిట్లు భాజపా సీనియర్‌ నాయకుడు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ వెల్లడించారు. అధిష్ఠానం ఆదేశించినప్పుడు వ్యక్తిగత కార్యదర్శి ప్రభుత్వానికి రాజీనామా లేఖను అందచేస్తారని చెప్పారు. విజయవాడలో ఆదివారం పదాధికారుల సమావేశం నుంచి అనారోగ్యంతో ఉన్నందునే తాను బయటకు వచ్చానని తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com