వేధింపుల కేసు

ప్రముఖ హాలీవుడ్‌ నటుడు సిల్వెస్టర్‌ స్టాలోన్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు లాస్ఏంజెల్స్‌ డిస్ట్రిక్ట్‌ అటార్నీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ కేసును శాంటా మోనికా పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ తమకు అప్పగించిందని పేర్కొన్నారు. 1990ల్లో లాస్‌వెగాస్‌కు చెందిన తాను ఆటోగ్రాఫ్‌ కోసం స్టాలోన్‌ వద్దకు వెళితే.. అతను బాడీగార్డ్‌తో కలిసి తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళ కేసు పెట్టింది. అయితే ఈ విషయాన్ని అప్పుడే పోలీసులకు చెప్పకుండా గతేడాది డిసెంబర్‌లో స్టాలోన్‌పై కేసు వేసింది. అయితే అక్కడి చట్టం ప్రకారం లైంగిక వేధింపులు ఎదుర్కొన్న బాధితులు నేరం జరిగిన పదేళ్లలోపు నిందితుడిపై కేసు పెట్టాలి. ఈ విషయం గురించి బయట ఎవరికైనా చెబితే చంపేస్తామని స్టాలోన్‌ బెదిరించాడని అందుకే అప్పట్లో చెప్పడానికి ధైర్యం చేయలేదని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఆ మహిళ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని స్టాలోన్‌ తరఫు న్యాయవాది మార్టీ సింగర్‌ అంటున్నారు. ‘స్టాలోన్‌ లైంగికంగా వేధించాడని ఆమె పిచ్చిగా మాట్లాడుతోంది. ఆమె ఆరోపణలు నిజం కాదని నిరూపించడానికి మా వద్ద ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. ఈ విషయంలో దాచాల్సింది ఏమీ లేదు. మహిళపై తనపై తప్పుకు కేసు పెట్టిందని స్టాలోన్ కూడా కేసు వేశారు.’ అని తెలిపారు. అయితే ఈ కేసుకు సంబంధించి శాంటా మోనికా పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com