వైకాపాలోకి వసంత కృష్ణప్రసాద్

తెలుగుదేశం పార్టీ కి పెద్ద దెబ్బ పడింది మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు, టీడీపీ నేత వసంత కృష్ణప్రసాద్‌ సైకిల్ దిగి ఫ్యాన్ పట్టుకోబోతున్నాడు. ఈ నెల 10వ తేదీన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. వైసీపీ అధినేత జగన్‌ సమక్షంలో కృష్ణ ప్రసాద్ వైసీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. నందిగామ నుంచి 1999 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన కృష్ణప్రసాద్‌..2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున గుంటూరు-2 టికెట్‌ ఆశించారు. టికెట్ రాకపోవడంతో ఆ ఎన్నికల్లో నందిగామ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. కొన్ని రోజులుగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తున్న కృష్ణ ప్రసాద్ తాజాగా పార్టీ ని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. వ్యాపారరీత్యా వైఎస్‌ కుటుంబంతో కృష్ణప్రసాద్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు మైలవరం నుంచి శాసనసభకు లేదా విజయవాడ నుంచి పార్లమెంట్‌కు వైసీపీ తరఫున టికెట్ ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com