వైభవంగా తాకా దీపావళి


తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (తాకా) ఆధ్వర్యంలో శనివారం నాడు మిస్సిసాగాలోని పోర్ట్ క్రెడిట్ సెకండరీ స్కూల్లో వైభవంగా నిర్వహించారు. వెయ్యి మందికి పైగా ప్రవాసులు హాజరయిన ఈ వేడుకల్లో అయిదు గంటల పాటు 25కు పైగా సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను అలరించాయి. తాకా  కార్యదర్శి లోకేష్ చిల్లకూరు స్వాగతోపన్యాసం అనంతరం జ్యోతి సామంతపూడి, మీనా ముల్పూరి , ధనలక్ష్మి  మునుకుంట్ల, కల్పన మోటూరి, సరస్వతి కొండబత్తిని తదితరులు జ్యోతి ప్రజ్వలన చేయగా భారత, కెనడా జాతీయ గీతాలతో  సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.  టొరంటో ప్రవాస చిన్నారులు, యువత కూచిపూడి, భరతనాట్యం, కథాకళి , జానపద, సినిమా గీతాలు, నృత్యా లు, నాటికలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. సాంస్కృతిక కార్యక్రమాలను అరుణ్ కుమార్ లయం, దీప సాయిరాంలు పర్యవఏక్షించారు. కీర్తి సుఖవాసి, సందీప్ లయంలు వ్యాఖ్యాతలగా వ్యవహరించారు. తాకా అధ్యక్షుడు హనుమంతాచారి సామంతపూడి సభికులను ఆహ్వానించి, గత రెండేళ్లల్లో తాకా నిర్వహించిన కార్యక్రమాలను వివరి౦చారు, తాకా అత్యధిక జీవిత సభ్యులు, దాతలు కలిగిన సంస్థగా వృద్ధి చెందిందని, కెనడాలో తెలుగు స౦స్కృతి, సా౦ప్రదాయలను ము౦దు తరాల వారికి అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. గత పాతికేళ్లుగా కెనడాలో నివసిస్తూ మూడోసారి తానా ప్రాంతీయ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన లక్ష్మీనారాయణ సూరపనేనిని తాకా కార్యవర్గం ఘనంగా సన్మానించింది. తాకా దీపావళి కార్యక్రమ దాతలు రాధాకృష్ణ గూడూరు, ప్రసాద్ ఓడూరి, వైశాలి శ్రీధర్‌లను లక్ష్మీనారాయణ జ్ఞాపికలతో సత్కరించారు. వేడుకల్లో  కోశాధికారి భానుప్రకాష్ పొతకమూరి, ఫౌండర్స్ చైర్మన్ రమేష్ మునుకుంట్లను, ట్రస్టీ సభ్యులు మీనా ముల్పూరి, వైశాలి శ్రీధర్, బాషా షేక్, వీరాంజనేయులు కోట, తాకా వ్యవస్థాపక సభ్యులు శ్రీనాథ్ కుందూరు, రామచంద్రరావు దుగ్గిన, మాజీ అధ్యక్షుడు గంగాధర్ సుఖవాసి, మునాఫ్ అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు. తాకా నూతన కార్యవర్గాన్ని (2017-2019) దిగువ చూడవచ్చు.


కార్యవర్గం
అధ్యక్షుడు: అరుణ్ కుమార్ లయం 
ఉపాధ్యక్షులు: రామచంద్రరావు దుగ్గిన 
జనరల్ సెక్రటరీ: నాగేంద్ర హంసాల 
కోశాధికారి: కల్పన మోటూరి 
కల్చరల్ సెక్రటరీ: దీప సాయిరాం
డైరెక్టర్: సురేష్ కుమార్ కూన 
డైరెక్టర్: రాఘవకుమార్  అల్లం 
డైరెక్టర్: వాణి జయంత్ 

ట్రస్టు బోర్డు
ఛైర్మన్ : లోకేష్ చిల్లకూరు 
ట్రస్టీ సబ్యులు : బాష షేక్, రాంబాబు కల్లూరు, కిరణ్ కాకర్లపూడి, ఆర్నాల్డ్ రామానుజులు మద్దెల

ఫౌండర్స్ చైర్మన్: మునాఫ్ అబ్దుల్ 









More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com