వైభవంగా పవన్ నూతన గృహ భూమిపూజ

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు కేంద్రబిందువైన రాజధాని ప్రాంతం నుంచి జనసేన పార్టీ విస్తరించాలనుకుంటోంది. అందుకు పక్కా వ్యూహంతో అడుగులు వేస్తోంది. ఈనెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించనుంది. ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ నివాసం ఉండటానికి, పార్టీ కార్యకలాపాలపై సమీక్షించటానికి క్యాంప్‌ కార్యాలయం నిర్మాణానికి సోమవారం ఉదయం ఆయన మంగళగిరి మండలం కాజ గ్రామంలో భూమి పూజలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. స్థానికంగా ఇవి చేపట్టం ద్వారా పవన్‌ తాను పక్కా లోకల్‌ అనిపించుకోవాలనుకున్నారు. ‘కానిస్టేబుల్‌గా నాన్న ఇక్కడే విధులు నిర్వహించారు. అప్పట్లోనే ఇక్కడ నివాసం ఉండాలనేది నా కల. అదిప్పుడు నెరవేరుతోంది’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం ఆయన మంగళగిరి మండలం కాజ వద్ద జాతీయ రహదారికి పక్కనే ఉన్న ఓ స్థిరాస్తి వెంచర్‌లో తను నివాసం కోసం భూమి పూజ చేశారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నగర నిర్మాణానికి ప్రభుత్వం రైతుల నుంచి భూములను సమీకరించే విషయంలో కూడా ప్రజల అభీష్టానికి అనుగుణంగానే నిర్ణయాలు ఉండాలని, వారిని బాధపెట్టి భూములు తీసుకోవద్దని గతంలో కూడా ఆయన మంగళగిరి ప్రాంతంలోని బేతపూడి, ఉండవల్లి, ఎర్రుబాలెం గ్రామాలకు వచ్చి స్థానిక రైతాంగానికి అండగా నిలిచారు. పవన్‌కు బాపట్లతోనూ సంబంధాలు ఉన్నాయి. ఉద్యోగ రీత్యా కొంతకాలం ఆయన తండ్రి అక్కడా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతంలో ప్రజలకు దగ్గరగా చేరువయ్యేందుకు తాను ఇక్కడ పార్టీ కార్యాలయం నిర్మించుకోవాలనుకుంటున్నానని, ఇక్కడే స్తిరనివాసం ఏర్పరుచుకోవాలనే అభిప్రాయం వెలిబుచ్చిందే తడవుగా అభిమానులు ముందుకు వచ్చి ఇవి సమకూర్చటం అభినందనీయమని పవన్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు మంగళగిరి కేంద్రంగా మారటం ఈ ప్రాంతంలోనే తాను నివాసం ఉండాలనుకోవటం ఇవన్నీ కాకతాళీయమే. ఇంతకు ముందే రా¦జధాని ప్రాంతంలో పార్టీ కార్యాలయం ప్రారంభించాలనుకోగానే చినకాకానిలో ఓ స్థలదాత పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమిని ఇచ్చారు. ఇలా పవన్‌కల్యాణ్‌కు జిల్లాలో ఏదీ చేయాలనుకున్నా సంపూర్ణ సహకారం అందుతోంది. ఈనెల 14న పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన రాష్ట్ర రాజకీయాలపై తన వైఖరి ఎలా ఉండబోతుంది? భవిష్యత్‌లో పార్టీ కార్యక్రమాలకు దిశా, నిర్దేశం చేయటానికి కూడా పవన్‌ గుంటూరు జిల్లానే ఎంపిక చేసుకోవటం గమనార్హం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com