వ్యభిచార కేసులో విచారణ

నటి మెహరీన్‌కు అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. అమెరికాలో భారీ సెక్స్‌ రాకెట్‌ నడిపిస్తున్న ఇద్దరు తెలుగు దంపతులను అక్కడి ఫెడరల్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే చిత్రీకరణ నిమిత్తం మెహరీన్‌ ఇటీవల అమెరికా వెళ్లారు. అయితే అక్కడి ఎయిర్‌పోర్ట్‌లోని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు మెహరీన్‌ టాలీవుడ్‌ నటి అని తెలిసి ఆమెను విచారణ నిమిత్తం నిలిపివేశారట. ఈ కేసు విషయంలో తనను దాదాపు అరగంట పాటు విచారించినట్లు మెహరీన్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ‘నా తల్లిదండ్రులను కలవడానికి వాంకువేర్‌ నుంచి అమెరికాకు వెళుతుండగా నేను టాలీవుడ్‌ నటిని అని తెలిసి ఇమ్మిగ్రేషన్‌‌ అధికారులను నన్ను నిలిపివేశారు. సెక్స్‌ రాకెట్‌కు సంబంధించి నన్ను కొన్ని ప్రశ్నలు అడిగారు. దాంతో నేను షాకయ్యాను. నేను తరచూ అమెరికాకు వెళ్లి వస్తుంటాను. కానీ అక్కడ టాలీవుడ్‌ నిర్మాత సెక్స్‌ రాకెట్‌ నడుపుతున్న విషయం వారు చెప్పేవరకు నాకు తెలీదు. అమెరికాకు వచ్చే ప్రతీ టాలీవుడ్‌ నటిని విచారిస్తున్నామని తెలిపారు’ అని పేర్కొన్నారు మెహరీన్‌. మెహరీన్‌తో పాటు మరో ముగ్గురు తెలుగు కథానాయికలను కూడా దాదాపు 6 గంటల పాటు విచారించినట్లు తెలుస్తోంది. మోదుగుమూడి కిషన్‌ అనే వ్యాపారవేత్త తెలుగు సినిమాలను నిర్మిస్తుంటాడు. పలు సినిమాలకు అతను ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగానూ వ్యవహరించాడు. అతను తన భార్య చంద్రతో కలిసి వర్ధమాన నటీమణులకు అవకాశాలు ఇస్తామని నమ్మించి వ్యభిచారంలోకి దింపుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పోలీసులు వారిద్దరినీ అరెస్ట్‌ చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com