వ్యాయామానికి విరామం మంచిది కాదు

పని ఒత్తిడి కావచ్చు. ప్రయాణాలు ఎక్కువై కావచ్చు. బలమైన గాయాల వల్ల కావచ్చు ఒక్కోసారి రోజువారి వ్యాయామాలకు దీర్ఘకాల అంతరాయం ఏర్పడుతుంది. అయితే, ఆ తర్వాత ఎప్పుడో పరిస్థితులు అనుకూలించి తిరిగి వ్యాయామాలు ప్రారంభించాలనిపించవచ్చు. అలా కొంత వ్యవ ధి తర్వాత తిరిగి వ్యాయామాలు మొదలెట్టిన సమయంలో కొన్నిసార్లు అనుకోని ఇబ్బందులు ఎదురు కావచ్చు. ముఖ్యంగా దీర్ఘకాలిక గ్యాప్‌ కారణంగా, శరీరమంతా బిగుసుకుపోయి, కీళ్లు గిడసబారిపోయి, అవసరమైన రీతిలో శరీరం వంగలే కపోయి అదో పెద్ద అవస్థగా అనిపించవచ్చు ఒక్కోసారి మొండిగా ఏదో చేయబోయి, గాయాల పాలయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. శరీరంలో ఒకప్పటి శక్తి లేకపోవడం వల్ల కూడా కిష్టమైన భంగిమలు చేయబోయి, తూలిపడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. వీటిని అధిగమించడానికి, పెద్ద గ్యాప్‌ తర్వాత తిరిగి వ్యాయామం చేయబోతున్నప్పుడు కొన్ని నియమాలు, జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ప్రారంభంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వామ్‌-అప్స్‌ చేయడాన్ని దాటవేయకూడదు.ఈ దశలో నిలబడి చేతులు పైకి ఎత్తడం, భుజం, మెడ, భుజాలను తిప్పే రొటేషన్‌ వ్యాయామాలు, స్ట్రెచ్‌ ఎక్సర్‌సైజులు కీళ్లను తిప్పడం వంటివి తప్పనిసరిగా చేయాలి. యోగాలోని తాడాసనం కూడా ఇందుకు ఉపయోగపడుతుంది.అంతకు ముందు చేసిన కష్టమైన వ్యాయామాలకు బదులుగా, బ్రిస్క్‌ వాకింగ్‌, స్విమ్మింగ్‌, సైక్లింగ్‌ లాంటివి చేయడం మేలు.అంతకు ముందు వ్యాయామం చేశామనే విషయాన్ని మరిచిపోయి, వ్యాయామాల్ని ఇప్పుడే తొలిసారి మొదలెట్టామని అనుకోవాలి. ఒకటి రెండు వారాల దాకా బాగా సులువైన వ్యాయామాలే చేయాలి. శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడానికి బిస్కీలు, దండాలు చేయవచ్చు. తక్కువ బరువున్న డంబుల్స్‌తో భుజాలను ఉత్తేజితం చేయవచ్చు.పొట్టభాగాన్ని పటిష్టపరిచేందుకు సూర్య నమస్కారా లతో పాటు యోగాకు సంబంధించిన భుజంగాసనం, సేతుబంధాసనం, నౌకాసనం కూడా చేయవచ్చు.తొలి రోజే ఏకంగా గంటసేపు చేయకుండా, 15 నిమిషాలతోనే సరిపెట్టాలి. ఆ తర్వాత క్రమక్రమంగా పెంచుకుంటూ పోవచ్చు. తొలి రోజుల్లోనే అతిగా చేస్తే నీరసం, నిస్సత్తువా ఆవరించి మళ్లీ కొద్ది రోజుల దాకా వ్యాయామం చేయలేని స్జితి ఏర్పడవచ్చు.వారానికి ఐదు రోజులే వ్యాయామం చేయడం అన్ని విధాలా మంచిది.వ్యాయామాల చివరన కాసేపు ప్రాణాయామం చేసి శరీరం రిలాక్స్‌ కావడానికి చివరగా శవాసనం వేయడం కూడా అవసరం.అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే, తప్పనిసరిగా జిమ్‌కే వెళ్లాలని అనుకోకూడదు. అలా అనుకుంటే, మళ్లీ ఏదో అంతరాయం వచ్చి వ్యాయామాలకు మరోసారి బ్రేక్‌ పడవచ్చు. అందువల్ల ఇంటివద్దే ఇవన్నీ చేసుకోవడానికి సిద్ధమైపోవాలి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com