శాకాహారంతో ప్రమాదం ఏమిటి?

మాంసాహారం శరీరాన్ని దెబ్బతీస్తుంది.. శాకాహారం తినాలని చాలామంది చెప్తుంటారు. కానీ ఇప్పుడొచ్చిన చిక్కేంటంటే.. శాకాహారమూ ప్రమాదమట. అదెలాబరువెక్కడం.. రోగాల బారిన పడటం.. సౌందర్యం దెబ్బతినడం వంటి సమస్యల నుంచి బయటపడాలంటే మాంసాహారం తగ్గించాలని నిపుణులు చెప్తుంటారు. శాకాహారం ఎక్కువగా తీసుకోవాలంటారు. కొవ్వులను తగ్గించడం.. కొలెస్ట్రాల్‌ను నిరోధించడమే కాకుండా మెదడు చురుగ్గా పనిచేయాలంటే కూరగాయలే ఉత్తమం అని సలహా ఇస్తుంటారు. కానీ అతిగా కూరగాయలు అసలుకే ఎసరు తీసుకొస్తాయంటున్నారు హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు. ఏకరీతి కూరగాయల వల్ల పెద్దగా పోషక ప్రయోజనమేమీ ఉండదట. వారానికి సరిపడా కూరగాయలు తెచ్చుకుంటాం.. అవి అయిపోగానే మళ్లీ వారానికి సరపడా తెచ్చుకుంటాం.కూరగాయల..ఆకు కూరల సంఖ్య మారుతుందే తప్ప.. వాటి స్థానం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. తిన్నవే మళ్లీ మళ్లీ తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందవట. శాకాహారపు వేపుళ్లు ఎక్కువగా తినడం వల్ల శరీరానికి ప్రమాదమని నిపుణుల అభిప్రాయం. క్రమం తప్పిన శాకాహారం తీసుకోవడం వల్ల మొదటగా తల వెంట్రుకలు రాలిపోతాయట. తల వెంట్రుకల గట్టిదనానికి ఏకరీతి ఆహారం కాకుండా అన్ని రకాలా పోషకాలున్న ఆహారం తీసుకోవడం మంచిది. శాకాహారం వల్ల మూడ్ మారుతుందట. శాకాహారం వల్ల శాతం గుండెకు మంచి జరిగితే ప్రమాదకరమని సర్వేలు చెప్తున్నారు. ఎక్కువగా ప్రతికూల ధోరణితో ఆలోచిస్తారట. కాబట్టి తక్కువ మోతాదులో మాంసాహారం తీసుకోవడం శ్రేయస్కరమట. ధాన్యాలు.. పండ్లు.. నట్స్.. లెగ్యూమ్స్ వంటివి శరీరానికి మంచివని సూచిస్తున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com