శాక్రిమెంటోలో సామవేదం ప్రవచనం


శాక్రిమెంటో తెలుగు సంఘం(టాగ్స్), స్థానిక సేవాసదన్ సహకారంతో శాక్రిమెంటొ నగరంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనాన్ని ఏర్పాటు చేశారు. “ఆదిత్య ఆరాధన, ఆయురారోగ్య సాధన” అనే అంశంపై ఆయన చేసిన ప్రసంగం భక్తులను అలరించింది. సూర్య భగవానుడి వలన ప్రయోజనాలు సాధించిన ఇతిహాస ఘట్టాలను ఆయన వివరించారు. భోగం రోగాలవైపు, యోగం జ్ఞానం వైపు తీసుకెళ్తాయని, వేదాలలోని అపార జ్ఞానం వలన యువత ద్వారా మెరుగైన సమాజం సాధ్యపడుతుందని ఆయన వెల్లడించారు. టాగ్స్ కార్యవర్గ సభ్యులు షణ్ముఖ శర్మను ఘనంగా సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. కార్యక్రమ విజయవంతానికి వీర్రాజు విన్నకోట, వెంకటేష్ రాచపూడి, మనోహర్ మందడి, మోహన్ కాట్రగడ్డ, సందీప్ గుడుపెల్లి, శ్రీదేవి మాగంటి, కీర్తి సురం, సురేంద్రనాథ్ కొప్పారపు, శ్రీరామ్ అకిన, మమతా దాసి, నాగేశ్వరరావు దొండపాటి,నాగేంద్రనాథ్ పగడాల, శ్రీనివాస రావు యనపర్తి, ప్రసాద్ కేతిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, అశ్విన్ తిరునాహరి, మల్లిక్ సజ్జనగాండ్ల, స్వర్ణ కంభంపాటి, వాసు కుడుపూడి, సుధాకర్ వట్టి, రాంబాబు బావిరిశెట్టి, అనిల్ మండవ, వెంకట్ నాగం, భాస్కర్ దాచేపల్లి, ప్రసాద్ కేటిరెడ్డి, డా సంజయ్ యడ్లపల్లి తదితరులు కృషి చేశారు.











More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com