శివరాత్రి ఉపవాసం మంచిదే. కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి.

శివరాత్రి అనగానే మనకు చటుక్కున గుర్తుకువచ్చేది ఉపవాసం. ఈ పుణ్య దినమున ఉపవాసముంటే బోళా శంకరుడు తమ పాపాలన్నీ పోగొడతాడని, సిరిసంపదలు ఇస్తాడని భక్తుల పరమ విశ్వాసం. అందుకే శివరాత్రి రోజున పెద్ద సంఖ్యలో భక్తులు ఉపవాసం చేస్తారు. అయితే, ఆ రోజున ఉపవాసం ఉండాలనికునే వాళ్లు కింద చెప్పిన కొన్ని విషయాలను మరవొద్దు.
* ఉపవాసానికి కొన్ని రోజుల ముందు నుంచి పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్లు)బాగా ఉండే ఫుడ్స్‌ తింటే మంచిది. శరీరం పుష్టిగా తయారవుతుంది.
*ఉపవాస దీక్ష మొదలెట్టే ముందర నీళ్లు బాగా తాగాలి.
*శివరాత్రి నాడు ఉపవాసం ఉన్నవాళ్లు పాలు, పళ్లు తీసుకోవచ్చు.
*ఖర్జూరాలు, బాదం, రకరకాల నట్స్‌ కూడా వీళ్లు తినొచ్చు.
*ఖర్జూరం నీళ్లు మధ్య మధ్యలో తాగుతుంటే మంచిది.
*నీళ్లు మాత్రం బాగా తాగుతుండాలి. అలా అని ఒకేసారి ఎక్కువ నీళ్లు తాగకూడదు.
*ఉపవాసం ఉన్న వారు ఆకుకూరలను సూపులా చేసుకుని తాగొచ్చు.
*నీళ్లల్లో కొద్దిగ ఉప్పు వేసి అందులో నిమ్మకాయ లేదా కమలా పండు రసం పిండి
*మధ్య మధ్యలో తాగుతుంటే శరీరానికి శక్తి వస్తుంది.
*ఉప్పు వేసిన పలచటి మజ్జిగ కూడా ఉపవాసం దీక్ష చేసే వాళ్లకు మంచిది.
*ఉపవాసం వల్ల శరీరంలో తగిన ఎనర్జీ ఉండదు. అందుకే పళ్లు, పోషకాలు, పీచుపదార్థాలు వంటివి మధ్య మధ్యలో తింటుండాలి.
*ఉపవాసంలో ఉన్నవాళ్లు శ్రమకు దూరంగా ఉండాలి.
*ఉపవాస దీక్ష విరమించేటప్పుడు చక్కెర, ఫ్యాట్స్‌ ఎక్కువగా ఉన్న వాటిని, ఫ్రైస్‌ను తినొద్దు. తేలికపాటి ఫుడ్‌ తినడం వల్ల పొట్ట తేలిగ్గా ఉంటుంది.
*ఉపవాసం చేస్తున్నామని ఆ రోజు వేసుకోవాల్సిన మందులను చాలామంది మానేస్తుంటారు. అలా చేయకుండా కొద్ది నీటితో నైనా సరే మాత్రలను తప్పనిసరిగా వేసుకోవాలి.
*ఉపవాస దీక్ష అవగానే ఆకలితో ఒకేసారి ఎక్కువ ఆహారాన్ని తినకుండా కొద్ది కొద్దిగా తినాలి.
*ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు పాలు టీతో పాటు గ్రీన్‌, బ్లాక్‌, ఊలాంగ్‌, హెర్బల్‌ టీలు తాగొచ్చు. అలాగే కాఫీ విషయంలో కేఫినేటెడ్‌, డికేఫినేటెడ్‌ ఏదైనా తీసుకోవచ్చు.
*ఎక్కువ సమయం ఉపవాస దీక్షలో ఉంటే హై-ఇంటెన్సిటీ వ్యాయామాలు చేయకూడదు.
*ఫాస్టింగ్‌ చేసేటప్పుడు తరచూ కునుకు తీయాలి. ఇలా చేయడం వల్ల విశ్రాంతి దొరికి హుషారుగా ఉంటారు.
******ఉపవాసం వల్ల…
*ఏకాగ్రత పెరుగుతుంది.
*శరీర బరువుతో పాటు, ఫ్యాట్‌ కూడా తగ్గుతుంది.
*బ్లడ్‌షుగర్‌ ప్రమాణాలు తగ్గుతాయి.
*ఇన్సులిన్‌ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.
*ఎనర్జీ ప్రమాణాలను పెంచుతుంది.
*కొవ్వును కరిగిస్తుంది.
*బ్లడ్‌ కొలె స్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
*అల్జీమర్స్ జబ్బును నిరోధిస్తుంది.
*ఏజింగ్‌ ప్రాసె్‌సను రివర్స్‌ చేస్తుంది.
* మంటను తగ్గిస్తుంది.
****వీరికి వద్దు..
చిన్న పిల్లలు ఉపవాసం చేయకూడదు.అలాగే గర్భిణీలు కూడా ఉపవాసం చేయడం మంచిది కాదు. వీరు ఉపవాసం చేస్తే కడుపులో ఉన్న శిశువుకు మంచిది కాదు.అలాగే తీవ్ర అనారోగ్యాలతో బాధపడేవాళ్లు, సీనియర్‌ సిటిజన్లు కూడా ఉపవాస దీక్షకు దూరంగా ఉంటే మంచిది.రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బులు, థైరాయిడ్‌ వంటి వాటితో బాధపడేవాళ్లు ఉపవాసాలు చేయకూడదు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com