శృంగారానికి ముందు సెంటు వద్దు

ప్రాజెక్టులూ టార్గెట్లూ లేదంటే పార్టీలూ వేడుకలూ ఇంకా సమయం ఉంటే స్మార్ట్‌ ఫోను కాలక్షేపాలతో గడిపేస్తోన్న నేటి యువతకి శృంగారంపట్ల సరైన అవగాహన ఉండటం లేదన్న విషయం తెలిసిందే. అందుకే అమెరికా, ఐరోపా దేశాల్లో ప్రముఖ సెక్స్‌ నిపుణురాలిగా పేరొందిన సూసాన్‌ క్విలియమ్‌ పండంటి శృంగార జీవితం కోసం కొన్ని సూత్రాలు చెబుతున్నారు… ప్రతి మనిషి శరీరానికీ సహజమైన ఒక వాసన ఉంటుంది. అది జీవిత భాగస్వామిని మత్తెక్కిస్తుంది. కాబట్టి పడగ్గదిలోకి వెళ్లేముందు పెర్‌ప్యూమ్‌లూ బాడీ స్ప్రేలూ వాడొద్దు. చక్కగా స్నానం చేసి తాజాగా ఉంటే చాలట. రోజూ ఓ అరగంటపాటు ఏరోబిక్స్‌ చేస్తే మెదడులో ఫీల్‌గుడ్‌ హార్మోన్లు విడుదలవుతాయి. డార్క్‌ చాకొలెట్లలో ఉండే ఫినైల్‌ ఇథైల్‌ ఎమైన్‌ అనే పదార్థం, శరీరంలో ప్రేమ భావనలను పెంపొందించే రసాయనాలను విడుదలయ్యేలా చేస్తుంది. దోస, కీరదోసల రుచి, వాసనలు మహిళల్లో లైంగికోత్తేజాన్ని కలిగిస్తాయట. ఒత్తిడి కోరికని తగ్గించేస్తుంది. అందుకే ఎంత అత్యవసర పనిలో ఉన్నా మధ్యలో ఐదూ పదీ నిమిషాలు విశ్రాంతి తీసుకుంటూ ఒత్తిడిని తగ్గించుకోండి. ప్రశాంతమైన మనసుతో శృంగారానికి సమాయత్తంకండి. సాహసం కూడా శృంగారేచ్ఛకి మూలమేనట. ఎందుకంటే సాహసక్రీడలవల్ల కోరికలు పెంచే డోపమైన్‌ అధికంగా విడుదలవుతుంది. పడగ్గదిలోకి వెళ్లేముందు శాచ్యురేటెడ్‌ కొవ్వులు అధికంగా ఉండే ఆహారానికి దూరంగా ఉండండి. అప్పుడప్పుడు మర్దన చేయించుకోవడం లేదా ఆవిరి స్నానం చేయడంవల్ల రక్త సరఫరా మెరుగై, శరీరం సమాగమానికి చక్కగా సిద్ధమవుతుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com