శెభాష్ బెజవాడ!

అత్యాచారం కేసులో నిందితుడికి జీవితఖైదు విధిస్తూ విజయవాడ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. విజయవాడలో కొందరు యువకులు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారు. మత్తు మందు ఇచ్చి వారి వద్ద ఉన్న నగదు, నగలు దోచుకున్నారు. సెల్‌ఫోన్లలో అసభ్యదృశ్యాలను చిత్రీకరించారు. ఈ ఘటనలపై 2014 ఆగస్టు 23న విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై నేరం రుజువు కావడంతో ఏ1 నిందితుడు నిమ్మకూరి సాయిరామ్‌కు ప్రత్యేక న్యాయస్థానం జీవితఖైదు విధించింది. మిగిలిన నిందితులు దీపక్‌, అభిలాష్‌కుమార్‌, అబ్దుల్‌ ఖాదర్‌లకు 20ఏళ్ల చొప్పున, దుర్గాప్రసాద్‌కు 8ఏళ్ల చొప్పున జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఇదే కేసులో ఉన్న ఆరో నిందితుడు మైనర్‌ కావడంతో అతనిపై ఉన్న కేసు జువెనైల్‌ కోర్టుకు బదిలీ అయింది. అప్పటి విచారణాధికారిపై కూడా చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com