శెభాష్ సింధు

మలేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత అగ్రశ్రేణి షట్లరు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌ దూసుకుపోతున్నారు. మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో కరోలినా మారిన్‌(స్సెయిన్‌)తో జరిగిన పోరులో సింధు 22-20, 21-19తో విజయం సాధించింది. తొలి గేమ్‌ నుంచే దూకుడుగా ఆడుతూ వచ్చిన సింధు విరామానికి 11-10తో ఆధిక్యంలో నిలిచింది. అయితే ఆ తర్వాత పుంజుకున్న మారిన్‌ వరుసగా స్కోరు సమం చేస్తూ వచ్చింది. కాగా ఈ క్రమంలో జోరు పెంచిన సింధు 22-20తో తొలి గేమ్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత రెండో గేమ్‌లోనూ సింధు మొదటి నుంచే ఆధిక్యం సాధిస్తూ వచ్చింది. ఆ క్రమంలోనే విరామానికి 11-6తో మరోసారి ఆధిక్యంలో నిలిచింది. తర్వాతి నుంచి దూకుడు పెంచిన మారిన్‌ అద్భుతంగా చెలరేగి స్కోరు సమం ప్రయత్నం చేసింది. కానీ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండానే సింధు 21-19తో రెండో గేమ్‌ను కైవసం చేసుకొని సెమీస్‌లోకి అడుగుపెట్టింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com