శ్రీకాళహస్తిలో భారీ రద్దీ

గ్రహణ గండాలకు అతీతమైన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయం భక్తులతో కిక్కిరిసింది. గ్రహణ కాల సమయంలో దేశంలోని ఆలయాలు మూతపడగా నవగ్రహాల కవచ దారుడైన వాయులింగేశ్వరస్వామి, దేవేరి జ్ఞాన ప్రసున్నాంబ అమ్మవారు వెలసిన శ్రీకాళహస్తీశ్వరాలయం తెరిచే ఉంటుంది. గ్రహణ కాల సమయంలో స్వామి, అమ్మవార్లకు గ్రహణ కాలాభిషేక పూజలు నిర్వహిస్తారు. గ్రహణ సమయంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు ఇప్పటికే అధికసంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయం భక్తజనసంద్రంగా మారింది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com