శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల వివరాలు

శ్రీకాళహస్తీశ్వరాలయంలో వచ్చే నెల 8వ తేదీ నుంచి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల గోడపత్రికలను గురువారం ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్వగ్రామమైన చిత్తూరు జిల్లా ఊరందూరులో ఆవిష్కరించారు. ఫిబ్రవరి 8న భక్తకన్నప్ప ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే ఉత్సవాల్లో 13న మహాశివరాత్రి (బంగారు నంది, సింహవాహనాలపై ఊరేగింపు), 14న రథోత్సవం, 15న స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం ఉంటాయి. ఈ విశేషోత్సవాలు 20న ఏకాంతసేవతో ముగించనున్నట్లు ఈవో భ్రమరాంబ తెలిపారు. ఈ దఫా వార్షికోత్సవాల్లో.. భక్తులు విరాళాలతో సిద్ధమైన స్వర్ణవాహనాలపై శ్రీజ్ఞానప్రసూనాంబిక సమేత సోమస్కంధమూర్తి ఉత్సవమూర్తులు దర్శనమీయనున్నట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో ఈ నెల 31న చంద్ర గ్రహణం కారణంగా దర్శన, వ్రత, కల్యాణ వేళల్లో మార్పులు ఉంటాయని దేవస్థానం అధికారులు గురువారం తెలిపారు. 31న (బుధవారం) సాయంత్రం 5.18 గంటల నుంచి రాత్రి 8.41 గంటల వరకు గ్రహణం సమయం కావడంతో ఆ రోజు ఉదయం 9.30 గంటలలోపు వ్రతాలు, ఇతర పూజలన్నీ పూర్తిచేసి సర్వదర్శనాలు నిలిపివేస్తారు. నిత్య కల్యాణం ఉదయం 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. అనంతరం 9.30 గంటలకు ఆలయ ద్వారాలు మూసివేస్తారు. సంప్రోక్షణ, ఇతర పూజల అనంతరం ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 7.30 గంటల నుంచి సర్వ దర్శనానికి భక్తులను అనుమతిస్తారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com