శ్రీశైలంలో సంక్రాంతి విశేషాలు

శ్రీశైల మహాక్షేత్రంలో ఈనెల 12వ తేదీ నుంచి 18 వరకు మకర సంక్రాంతి మహోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో భరత్‌గుప్తా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 12న యాగశాల ప్రవేశం, ధ్వజారోహణంతో మహోత్సవాలు ప్రారంభమై ప్రతి రోజు శ్రీస్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వాహన సేవలు, గ్రామోత్సవం జరుగుతుందన్నారు. 15న మకర సంక్రాంతిని పురస్కరించుకుని శ్రీగంగా పార్వతీ సమేత మల్లికార్జున స్వామివార్ల లీలాకల్యాణోత్సవం దేవస్థానం తరఫున నిర్వహించనున్నట్లు చెప్పారు. సంక్రాంతి మహోత్సవాల సందర్భంగా 12 నుంచి 18వరకు శాశ్వత, ఆర్జిత సేవలైన కల్యాణం, రుద్రహోమం, గణపతి హోమం, నవగ్రహ హోమం, మృత్యుంజయ హోమం, ఏకాంత సేవ, సర్వసేవా పథక సేవలను నిలుపుదల చేసినట్లు ఈవో స్పష్టం చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com