సంకెళ్లు తెంచుకోండి

జాతులు, కులాల కొట్లాట మధ్య కళలు చనిపోవడం ప్రస్తుత సమాజంలో కనిపిస్తున్న అతిపెద్ద బాధాకర పరిణామమని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు. విజయవాడ రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో ఆదివారం బాలును ఘనంగా సత్కరించి, జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలు అడిగిన పలు ప్రశ్నలకు తన మనసులోని భావాలను బాలు పంచుకున్నారు. కళలను, మన సంగీతాన్ని కాపాడుకునే విషయంలో సంకెళ్లు వేసుకుని నపుంసకులుగా ప్రజలు బ్రతుకుతున్నారన్న బాధను బాలు వ్యక్తం చేశారు. తమకు నచ్చని నాయకుడిపై రోడ్లపైకి వచ్చి ఆగ్రహం వ్యక్తం చేసే ప్రజలు.. తమకు నచ్చని సినిమా, పాటను వ్యతిరేకించే విషయంలో ఎందుకు ముందుకు రారని ఆయన ప్రశ్నించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com