సంజీవిని ఆసుపత్రికి ₹12.5కోట్లు సేకరణ

కూచిపూడి గ్రామంతో పాటు పరిసర 150 గ్రామాల ప్రజలకు ఆరోగ్య అవసరాలు తీర్చే నిమిత్తం సిలికానాంధ్ర సంస్థ నిర్మిస్తున్న సంజీవిని ఆసుపత్రి నిర్మాణానికి టీవీ9 సహకారంతో ఆదివారం నాడు నిర్వహించిన విరాళ సేకరణ కార్యక్రమం ద్వారా ₹12.5కోట్లు సేకరించినట్లు సిలికానాంధ్ర వ్యవస్థాపకులు కూచిభొట్ల ఆనంద్ తెలిపారు. ప్రారంభ లక్ష్యం ₹10కోట్లుగా నిర్దేశించుకున్న ఈ కార్యక్రమం ద్వారా అనుకున్న దానికన్నా ఎక్కువగా నిధులు లభించడం పట్ల ఆనంద్ హర్షం వ్యక్తపరిచారు. దాతలకు ధన్యవాదాలు తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com