సంద్రం నీటితో దీపపు కాంతులు

దీపం అంటే నూనెతో పెడతాం.. లేదంటే కిరోసిన్‌ దీపం పెడతాం. కానీ గ్లాసు ఉప్పు నీళ్లతో లాంతరు వెలిగించగలమా.. ఫిలిప్పీన్స్‌కు చెందిన యువ శాస్త్రవేత్త వెలిగించి చూపించారు. అసియా మిజెనో అనే ఆర్కిటెక్‌, శాస్త్రవేత్త ఉప్పునీళ్లతో వెలిగే విద్యుత్‌ లాంతరును తయారుచేశారు. ఇప్పటికీ ప్రపంచంలో విద్యుత్‌ సదుపాయం లేకుండా బతుకుతున్న ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. అలాంటి వారికి ఉపయోగపడేందుకు.. అలాగే పర్యావరణ సహితంగా ఉండేందుకు ఈ లాంతరును తయారు చేశారు.
ఈ లాంతరు ఎనిమిది గంటల పాటు వెలగడానికి కేవలం రెండు స్పూన్ల ఉప్పు, గ్లాసెడు నీరు చాలు. విద్యుత్‌ ఉత్పత్తి కోసం చిన్న చిన్న ప్రయోగాలతో దీనిని రూపొందించారు. ఎలక్ట్రోలైట్స్‌లో ఉత్ప్రేరకాలు, మిశ్రమలోహాలను ఉంచడం ద్వారా విద్యుత్‌శక్తిని పుట్టించినట్లు మిజెనో తెలిపారు. గాల్వానిక్‌ సెల్‌ సైంటిఫిక్‌ ప్రిన్సిపల్‌ను ఉపయోగించారు. కిరోసిన్‌, ఎలక్ట్రిక్‌ ల్యాంప్‌లతో పోలిస్తే ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. అలాగే ఇందులో విద్యుత్‌తో అవసరమైతే ఫోన్‌కు ఛార్జింగ్‌ కూడా పెట్టుకోవచ్చు
ఈ లాంతరు వల్ల పర్యావరణానికి ఎలాంటి ప్రమాదం ఉండదని, తక్కువ ఖర్చుతో లభిస్తుందని మిజెనో తెలిపారు. అలాగే విద్యుత్‌ లైన్లు, ఎలాంటి విద్యుత్‌ సదుపాయం లేని మారుమూల ప్రాంతాలకు ఈ ఉప్పునీటితో నడిచే లాంతర్లు ఎంతగానో ఉపయోగపడతాయి. అన్నీ ప్రణాళిక ప్రకారం జరిగితే.. 2016లో ఈ లాంతర్లు మార్కెట్‌లోకి తెస్తానని మిజెనో తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com