సగటు ఇంటర్నెట్ వినియోగం నాలుగు జీబీలు

భారత్‌లో జియో రాకతో టెలికాం కంపెనీలు ధరలు తగ్గించడంతో మొబైల్‌లో ఇంటర్నెట్‌ వాడకం రోజురోజుకు పెరుగుతోంది. 2014తో పోల్చుకుంటే 2017లో దేశవ్యాప్తంగా మొబైల్‌ డాటా వినియోగం 15 రెట్లు పెరిగినట్లు ట్రాయ్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2014 సంవత్సరం ఆఖరులో సగటున ఒక వ్యక్తి 0.26 జీబీ డేటాను వినియోగిస్తుండగా అది 2017 నాటికి సగటున 4.13 జీబీకి పెరిగింది. 2014లో ఒక జీబీ ధర సగటున రూ.266 ఉండగా ప్రస్తుతం రూ.19కే లభ్యమవుతోంది. 2014లో వాయిస్‌ కాల్స్‌ సగటున నెలకు 383 నిమిషాలు నమోదవగా.. 2017 ఆఖరికి 441 నిమిషాలకు పెరిగినట్లు గణాంకాలు చెపుతున్నాయి. మరోవైపు పెరుగుతున్న డేటా వినియోగం టెలికాం కంపనీలకు ఆదాయాన్ని సమకూర్చడం లేదు. ట్రాయ్‌ లెక్కల ప్రకారం ప్రతి జీఎస్‌ఎం వినియోగదారుడి నుంచి వచ్చే నెలవారి సగటు ఆదాయం 2014లో రూ.117 ఉండగా.. ప్రస్తుతం రూ.80కి పడిపోయింది. 2016 సెప్టెంబర్‌లో 4జీ సేవల్లోకి రిలయన్స్‌ జియో ప్రవేశించడం.. జియోకు పోటీగా ఇతర టెలికాం సంస్థలు వినూత్న ఆఫర్లను అందుబాటులోకి తీసుకురావడంతో డేటా, వాయిస్‌ కాల్స్‌ వినియోగం భారీగా పెరిగినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com