సదా సింగపూర్ స్మరామి!

వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పార్టీ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన విధానంతో పాటు ఇంటింటికీ తెలుగుదేశం జరుగుతున్న తీరు, జగన్‌ పాదయాత్ర తదితర అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. పాదయాత్ర చేస్తున్న వ్యక్తి ప్యారడైజ్‌ వివాదంపై సమాధానం చెప్పలేకపోతున్నాడని నేతలు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. ప్యారడైజ్‌పై నోరుమెదకపోవడంతో జగన్‌ తప్పు చేశాడనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. జగన్‌ అనుకున్నంతగా ప్రజాస్పందన పాదయాత్రలో లేకపోవడంతో నిర్దేశించుకున్న సమయానికంటే ముందుగానే నిన్న పాదయాత్ర ముగించారని వివరించారు. సీఎం కుర్చీపై యావ తప్ప ప్రజాసమస్యలపై అతనికి చిత్తశుద్ధిలేనందునే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నాడని అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం నిర్వహిస్తున్న ఇంటింటికీ తెలుగుదేశంపై సీఎం ఆరాతీశారు. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే నేతలంతా తప్పనిసరిగా ఇంటింటికీ తెలుగుదేశం కొనసాగించాలని ఆదేశించారు. సింగపూర్‌ పార్లమెంట్‌లోనూ ప్రతిపక్షం నామమాత్రమేనని, అయినా అధికారపక్షం సమావేశాలను సీరియస్‌గా తీసుకుని ప్రజా సమస్యలను పరిష్కరిస్తుందని నేతలకు వివరించిన చంద్రబాబు… మనమూ అదే తరహాలో రాష్ట్రాభివృద్ధికి అసెంబ్లీని వేదికగా చేసుకుందామని పిలుపునిచ్చారు. గతంలో ప్రతిపక్షం అస్తమానం అడ్డుతగలడం వల్ల సభ సజావుగా సాగేది కాదని, ఇప్పుడు ప్రజా సమస్యల పరిష్కారానికి సరైన వేదికగా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com