సన్నాహక ఆటలో తుక్కు రేపిన యువీ

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వార్మప్‌ మ్యాచ్‌లో కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని, ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ మెరుపు బ్యాటింగ్‌ చేశారు. దూకుడుగా ఆడుతూ అర్ధశతకాలు బాదారు. ముందే చెప్పినట్లు ఈ జోడీ స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేసి ప్రత్యర్థి బౌలింగ్‌పై దాడికి దిగింది. సిక్సర్లు, బౌండరీలతో అభిమానులను అలరించింది. ఇక తెలుగు ఆటగాడు అంబటి రాయుడు శతకంతో, ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ సమయోచిత బ్యాటింగ్‌తో ఆకట్టుకోవడంతో భారత్‌-ఏ 2 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. ముంబయి బ్రాబౌర్నె వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ ఓడిన భారత్‌-ఏ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. జట్టు స్కోరు 25 పరుగుల వద్దే ఓపెనర్‌ మన్‌దీప్‌ సింగ్‌ (8) వికెట్‌ కోల్పోయినా శిఖర్‌ధావన్‌ (63; 84 బంతుల్లో 8×4, 1×6) నిలకడగా బ్యాటింగ్‌ చేశాడు. 136 పరుగుల వద్ద శిఖర్‌.. జే.బాల్‌ బౌలింగ్‌లో బట్లర్‌ చేతికి చిక్కడంతో యువరాజ్‌ సింగ్‌ (56; 48 బంతుల్లో 6×4, 2×6) రంగంలోకి దిగాడు. తొలి పది బంతులు నిలకడగా ఆడినా యువీ ఆ తర్వాత సిక్సర్లతో రెచ్చిపోయాడు. అంతకు ముందే అర్ధశతకం సాధించిన అంబటి రాయుడు (100 రిటైర్డ్‌; 97 బంతుల్లో 11×4, 1×6) యువీ అర్ధశతకం చేసిన వెంటనే శతకం పూర్తిచేశాడు. రాయుడు రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరగడంతో క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ ధోని (68 నాటౌట్‌; 40 బంతుల్లో 8×4, 2×6) స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేశాడు. ప్రత్యర్థి బౌలర్లను ఆడుకొన్నాడు. కేవలం 35 బంతుల్లో అర్ధశతకం బాదాడు. ఆఖరి ఓవర్‌లో 6, 4, 4, 2, 6, 1తో అదరగొట్టడంతో ఇంగ్లాండ్‌కు భారత్‌ 305 పరుగుల లక్ష్యం నిర్దేశించింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com