సప్తముఖ కాళసర్ప మహాగణపతి

దేశంలోనే అత్యంత పెద్ద వినాయకుడిగా పేరొందిన ఖైరతాబాద్‌ గణపతి ఈ పర్యాయం ‘శ్రీ సప్తముఖ కాళసర్ప మహాగణపతి’గా కొలువుదీరనున్నాడు. అందుకు సంబంధించిన వివరాలను ఆదివారం ఖైరతాబాద్‌ ఉత్సవ కమిటీ ఛైర్మన్‌ సింగరి సుదర్శన్‌, విగ్రహ శిల్పి రాజేంద్రన్‌ తదితరులు విడుదల చేశారు. విగ్రహంలో ప్రతిదీ ఏడు వచ్చేలా ఏర్పాటు చేయడం వల్ల ఉత్సవాలు చేసే వారికి, భక్తులకు మేలు జరుగుతుందని సిద్ధాంతి గౌరీభట్ల విఠల్‌శర్మ సూచనల మేరకు ఉత్సవ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందంటూ విగ్రహం ప్రత్యేకతను వెల్లడించారు.
* ‘శ్రీ సప్తముఖ కాళసర్ప మహాగణపతి’ విగ్రహం ఎత్తు 57 అడుగులు, వెడల్పు 24 అడుగులుగా ఉండనుంది. 60 అడుగుల తర్వాత ఏటా ఒక అడుగు తగ్గించాలనే నిర్ణయం ప్రకారం గత ఏడాదే 57 అడుగులుగా ఉండాల్సి ఉన్నా, శిల్పి షష్టి పూర్తి నేపథ్యంలో విగ్రహాన్ని 60 అడుగులుగా చేశారు. దాంతో గత ఏడాది ఉండాల్సిన 57 అడుగులు ఈ పర్యాయం రూపుదిద్దుకోనుంది. అలాగే వినాయకుడు ఏడు తలలు, 14 చేతులతో ఉండనున్నాడు. తలపై ఏడు సర్పాలతో అలంకరణ కానుంది. కింద ఏడు ఏనుగులు నమస్కరించే రూపంలో ఏర్పాటు కానున్నాయి. గణపతి మండపంలోనే కుడివైపున లక్ష్మీ, ఎడమ వైపున సరస్వతి విగ్రహాలు 14 అడుగుల ఎత్తున ఉంటాయి.
* ఏడు ముఖాలతో కూడిన వినాయకుడికి 14 చేతులు ఉండనున్నాయి. ప్రతి చేతిలోనూ ప్రత్యేకతను చాటుకునేలా ఒక అలంకరణ చేయనున్నారు. కుడివైపు ఉండే ఏడు చేతుల్లో పై నుంచి కిందకు వరుసగా.. అంకుశం, చక్రం, కత్తి, సర్పం, బాణం, గధ, ఆశీర్వాదం రూపంలో ఉంటాయి. ఎడమవైపు ఏడు చేతుల్లో పై నుంచి కిందకు పాశం, శంఖు, కమలం, ఢమరుకం, విల్లు, గడియం, లడ్డూ ఉంటాయి.
* కుడి వైపు మండపంలో శ్రీనివాస కల్యాణం చేయనున్నారు. ఈ ఏడాది వెంకటేశ్వరుడి కల్యాణ సంవత్సరం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఎడమ మండపంలో నందిపై శివపార్వతి, కుమారస్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com