సబ్జా గింజల్లో…కాలరీలు ఉండవు.యాంటాక్సిడెంట్లు బాగా ఉంటాయి.

సబ్జా గింజలు పోషకాల నిధులు. వీటిని ఫలూదా గింజలు, తుర్కుమేరియా గింజలు అని కూడా అంటారు. వీటిల్లో కార్బోహైడ్రేట్లు మెండుగా ఉంటాయి. రోగనిరోధకశక్తిని పెంపొందించే గుణాలు కూడా పుష్కలం. వీటి వల్ల మరెన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి.సబ్జాగింజల్లో ఎసెన్షియల్‌ ఫ్యాట్స్‌ ఉంటాయి. పీచుపదార్థాలు ఉంటాయి. కాలరీలు ఉండవు.యాంటాక్సిడెంట్లు బాగా ఉంటాయి. మధుమేహాన్ని నియంత్రిస్తాయి.రోజూ వీటిని రెండు టీస్పూన్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.నానబెట్టిన సబ్జా గింజల్లోంచి యాంటాక్సిడెంట్లతో పాటు జీర్ణక్రియకి సహకరించే ఎంజైములు కూడా విడుదలవుతాయి.పోషకవిలువలు ఉన్న వీటిని రకరకాల వంటల్లో వాడొచ్చు.సబ్జ గింజల వల్ల బరువు తగ్గుతారు.శరీర ఉష్ణోగ్రతను చల్లబరుస్తాయి. అందుకే వేసవిలో వీటి నీళ్లు తాగాలి.రక్తంలో చక్కెర ప్రమాణాలను నియంత్రిస్తాయి. శరీరాన్ని అత్యంతసహజంగా డిటాక్స్‌ చేస్తాయి.జీర్ణక్రియ బాగా జరిగేట్టు సహకరిస్తాయి.గుండెల్లో మంట, ఎసిడిటీ బాధలను కూడా తగ్గిస్తాయి. శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపేస్తాయి.చర్మ, శిరోజాలను ఇవి ఆరోగ్యంగా ఉంచుతాయి.మెత్తగా చేసిన సబ్జా గింజలను కొబ్బరినూనెలో కలిపి ఎగ్జిమా, సొరియాసిస్‌ వంటి వాటిపై రాస్తే మంచి ఫలితం ఉంటుంది.ఈ మిశ్రమాన్ని చర్మంపై రాసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అతినీలలోహితకిరణాల వల్ల హాని జరగదు. చర్మంపై ఉండే మురికి, కాలుష్యాలు సైతం ఈ స్కిన్‌ ప్యాక్‌ వల్ల పోతాయి. మచ్చలనేవి లేకుండా చర్మం కాంతివంతంగా తయారవుతుంది. మొటిమలను రానీయవు. నిత్యం వీటిని తీసుకోవడం వల్ల యంగ్‌గా కనిపిస్తారు.సబ్జా గింజల్లో విటమిన్‌-కె, విటమిన్‌-ఎ, ప్రొటీన్‌, ఐరన్‌లు బాగా ఉన్నాయి. పొడవైన, ఆరోగ్యకరమైన శిరోజాలకు ఇవి చాలా అవసరం. ప్రొటీన్‌, ఐరన్ల వల్ల జుట్టు పెరుగుతుంది. వెంట్రుకలు రాలవు. చుండ్రును నివారిస్తాయి.దగ్గు, ఫ్లూ జ్వర బాధలను తగ్గిస్తాయి.గర్భిణీలను సబ్జా గింజలు వాడొద్దంటారు. ఎందుకంటే ఆ టైములో అవి వారి శరీరంలోని ఈస్ట్రోజన్‌ హార్మోన్లను తగ్గిస్తాయట. అందుకే ఈ గింజలు వాడాలంటే వైద్యులను సంప్రదించడం తప్పనిసరి.ఈ గింజలు రక్తం గడ్డకట్టకుండా క్రమబద్ధీకరిస్తాయి.యోని ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి.సబ్జా గింజలు యాంటి-ఇన్ఫ్లమేటరీ ఏజెంట్‌గా పనిచేస్తాయి.దంతక్షయంతోపాటు నోటి అల్సర్లు, నోటి దుర్వాసనలను నివారిస్తాయి.రక్తహీనత తగ్గుతుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com