సబ్బులో మాంసం ఉందా?

సౌందర్యపోషణకు వాడే సబ్బులు, షాంపూలు, క్రీములు, టూత్‌పేస్టుల్లో శాఖాహారం లేదా మాంసాహారానికి సంబంధించిన మూలఉత్పత్తులు వాడారా, లేదా? అనే విషయమై ఇకపై అందరికీ తెలిసిపోనుంది. పచ్చ, ఎరుపు లేదా గోధుమరంగు గుర్తుతో వాటిని అందరికీ తెలిసేలా చేయాల్సిన బాధ్యత సంబంధిత ఉత్పత్తిదారులదేనని అధికారులు చెబుతున్నారు. ఆహార ఉత్పత్తులపై ఇప్పటికే ఈ నిబంధన అమల్లో ఉంది. శాఖాహారమైతే పచ్చటి బిందువు, మాంసాహారమైతే ఎర్రటి బిందువును లేబుల్‌పై ముద్రిస్తున్నారు. సౌందర్య సాధనాలపైనా ఇలాగే రంగుల బిందువులు ముద్రించేలా నిబంధనలు మార్చాలని ఔషధ సాంకేతిక సలహాబోర్డు నిర్ణయించింది. దీని అమలుకు ఔషధ, సౌందర్యసాధనాల చట్టం 1945లో సవరణలు చేయాల్సి ఉంటుంది. మరో ఆరునెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. సౌందర్యసాధనాల్లో మూల ఉత్పత్తులు ఏమిటో తెలుసుకునేలా చర్యలు చేపట్టాలని జైనులు, వినియోగదారుల వ్యవహారాల శాఖ ఎంతోకాలంగా డిమాండు చేస్తున్నట్లు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా డాక్టర్‌ ఎస్‌.ఈశ్వర్‌రెడ్డి తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com