సమస్యలు మాట్లాడుకుంటున్నాము. ఈలలు వేయొద్దు.

రాష్ట్రం మేలు కోరే వ్యక్తిగా తాను అనంతపురం జిల్లా ప్రజల ముందుకు వచ్చానని జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా ఆయన పలువురు రైతులు, వ్యవసాయ, నీటిపారుదల రంగ నిపుణులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. అనంతపురంలో కరవు పరిస్థితులపై చాలా మందితో మాట్లాడానన్నారు. అలాగే కొందరు మేధావులతోనూ ఈ సమస్యపై చర్చించినట్టు చెప్పారు. కరవు నివారణ చర్యలు, సాగులో జాగ్రత్తలు అంశంపై నిపుణులు సలహాలు ఇస్తారని చెప్పారు. మేధావులు ఇచ్చిన సలహాలు, సూచనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని పవన్‌ హామీ ఇచ్చారు. తాను మాట్లాడుతుండగా కొందరు ఈలలు వేయడంపై పవన్‌ స్పందించారు. బతుకు సమస్యకు సంబంధించిన అంశంపై చర్చిస్తున్నప్పుడు దయచేసి ఈలలు వేయవద్దని సూచించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com