సరికొత్తగా యాపిల్ ఆపరేటింగ్ సిస్టం

* కొత్త ఆపిల్‌ మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఐఓఎస్‌ 12లో వేగానికి ప్రాముఖ్యత ఇచ్చారు. ఈ కొత్త ఓఎస్‌లో యాప్స్‌ 40 శాతం వేగంగా ఓపెన్‌ అవుతాయి. కీబోర్డు 50 శాతం వేగంగా డిస్‌ప్లే అవుతుంది. స్క్రీన్‌‌ మీద ఎడమ నుంచి కుడివైపు స్లైడ్‌ చేస్తే కెమెరా ఓపెన్‌ అయ్యే వేగం 70 శాతం పెరుగుతుంది.
* ఫొటోస్‌ యాప్‌లో కొన్ని మార్పులు చేశారు. సజెస్టెడ్‌ షేరింగ్‌, సజెస్టెడ్‌ కాంటాక్ట్స్‌ ఫీచర్లను ప్రవేశపెట్టారు. మీ మొబైల్‌లో ఫొటోల్లో ఉన్న ముఖాలను పసిగట్టి… ఆయా వ్యక్తులకు ఫొటోలు షేర్‌ చేయొచ్చు అంటూ ఒక జాబితాగా సమకూరుతుంది. అలాగే ఏదైనా ఫొటోను షేర్‌ చేయడానికి ప్రయత్నిస్తే అవి ఎవరికి పంపితే బాగుంటుందనేది మెషీన్‌ లెర్నింగ్‌ ద్వారా ఫొటోస్‌ యాప్‌ సూచిస్తుంది.
* యాపిల్‌ మొబైల్‌ వినియోగదారులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న డునాట్‌ డిస్టర్బ్‌ (డీఎన్‌డీ) మోడ్‌ను ఐఓఎస్‌ 12లో తీసుకొచ్చారు. రాత్రి నిద్రపోయే సమయంలో డీఎన్‌డీ యాక్టివేట్‌ అవుతుంది. దీని వల్ల అనవసర ఫోన్‌కాల్స్‌, నోటిఫికేషన్ల ఇబ్బంది తగ్గుతుంది.
* స్మార్ట్‌ఫోన్‌ వచ్చాక ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి సోషల్‌ మీడియాకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నాం అంటూ అందరూ బాధపడిపోతున్నారు. ఇలాంటి వారి కోసం యాపిల్‌ కొత్త ఫీచర్‌ తెచ్చింది. స్క్రీన్‌టైమ్‌ ఫీచర్‌లో మీ ఫోన్‌లో ఏ సర్వీసును ఎంతసేపు వాడుతున్నారనేది మీరే తెలుసుకోవచ్చు. వీక్లీ రిపోర్ట్‌, మంథ్లీ రిపోర్ట్‌తో మీ మొబైల్‌ వాడకాన్ని ఎసెస్‌ చేసుకోవచ్చు. ఒక రోజుకు ఒక యాప్‌ను ఎంతసేపు వాడాలో నిర్ణయించి సెట్‌ చేసుకుంటే ఆ సమయం సమీపిస్తున్నప్పుడు ఈ ఫీచర్‌ మిమ్మల్ని అలర్ట్‌ చేస్తుంది.
* ఐఫోన్లలో ఉన్న పెద్ద సమస్య నోటిఫికేషన్లు. బ్యాంకు లావాదేవీల మెసేజ్‌లు, యాప్‌ నోటిఫికేషన్లు, మిస్డ్‌ కాల్స్‌ ఇలా అన్నీ వేర్వేరుగా లాక్ స్క్రీన్‌ మీద కనిపిస్తాయి. కొత్త ఓఎస్‌ నోటిఫికేషన్లు, మెసేజ్‌లను గ్రూప్‌గా విభజించుకోవచ్చు. విభాగం, సమయం లాంటి అంశాల వారీగా నోటిఫికేషన్లు విడిగా కనిపిస్తాయి.
* గతేడాది యానిమోజీ పేరుతో యాపిల్‌ కొత్త ప్రయోగం చేసింది. స్థిరంగా ఉంటే ఎమోజీల స్థానంలో అటు ఇటు కదిలే ఎమోజీలను తీసుకొచ్చి వాటిని యానిమోజీ అనే పేరు పెట్టింది. ఇప్పుడు వీటికి టంగ్‌ డిటెక్షన్‌ అనే కొత్త ఆప్షన్‌ను జోడించింది. అంటే ఆ యానిమోజీలు ఇప్పడు నాలుకను బయటకు తీసి అటు ఇటు ఆడిస్తూ సందడి చేస్తాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com