సరికొత్త రైళ్లు

నగర వాసులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఎంఎంటీఎస్‌ రెండో దశకు మార్గం సుగమమైంది. దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్‌ డివిజన్‌లోని మల్కాజ్‌గిరి-బొల్లారం లైన్‌ విద్యుదీకరణను ఇటీవలే పూర్తి చేశారు. కొద్ది రోజుల క్రితం రైల్వే అధికారులు గూడ్స్‌ రైలుతో ట్రయల్‌ రన్‌ను కూడా నిర్వహించారు. మల్కాజ్‌గిరి-మేడ్చల్‌ మార్గంలో ప్రస్తుతానికి బొల్లారం వరకు రైల్వే లైన్‌ విద్యుదీకరణను పూర్తి చేశారు. రైల్వే సేఫ్టీ కమిషనర్‌ తనిఖీ అనంతరం బొల్లారం వరకు ఎంఎంటీఎస్‌ రైళ్ల రాకపోకలకు మార్గం సుగమం కానుంది. అక్కడ నుంచి మేడ్చల్‌ వరకూ 12.32 కిలోమీటర్ల మేర వీలైనంత త్వరగా విద్యుదీకరణ పనులు పూర్తి చేయడానికి రైల్వే అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేస్తూనే ట్రాఫిక్‌ రద్దీని నివారించడానికి వీలవుతుందని 2003 ఆగస్టులో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం, దక్షిణ మధ్య రైల్వే మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌ (ఎంఎంటీఎస్‌) ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ఆ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రస్తుతం కాచిగూడ స్టేషన్‌ మీదుగా ఫలక్‌నుమా- లింగంపల్లి స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్‌ రైళ్లను నడుపుతున్నారు. ప్రతి రోజు 1.50 లక్షల మంది నగరవాసులు ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. కాచిగూడ స్టేషన్‌ మీదుగా ఫలక్‌నుమా-సికింద్రాబాద్‌ లైన్‌ విద్యుదీకరణను 2004లో పూర్తి చేశారు. ఈ క్రమంలో సీతాఫల్‌మండి-మల్కాజ్‌గిరి-మౌలాలి విద్యుదీకరణ పనులను 2010లో పూర్తి చేసి నిర్వహణ ను రైల్వే ఎలక్ట్రికల్‌ కాచిగూడ సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌కు అప్పగించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com