సలహాల వేటలో

అనీస్‌ బాజ్మి దర్శకత్వంలో నిర్మించే ఆంఖే సినిమా పొడిగింపు చిత్రం ‘ఆంఖే-2’ దీపావళికి విడుదలవుతుంది. రోహిత్‌షెట్టి నిర్మించే గోల్‌మాల్‌ పొడిగింపు సినిమా కూడా దీపావళి కానుకే. ఆంఖే-2 భారీ వ్యయంతో నిర్మించే సినిమా కనుక ప్రత్యేకత వున్న రోజే దానిని విడుదల చేయడం సబబు అంటున్నాడు అనీస్‌ బాజ్మి. ఇక గోల్‌మాల్‌ విషయానికొస్తే ఇది నాలుగో పొడిగింపు. తొలుత 2006లో గోల్‌మాల్‌ సినిమా వచ్చింది. తరవాత గోల్‌మాల్‌ రిటర్న్స్‌, గోల్‌మాల్‌-3 పేర్లతో పొడిగింపు సినిమాలు వచ్చాయి. ఈ నాలుగవ పొడిగింపు సినిమాలో అజయదేవగన్‌, అర్షద్‌వార్సి, శర్మన్‌జోషి, తుస్సార్‌ కపూర్‌, పరేష్‌ రావెల్‌ నటిస్తున్నారు. ఇంతవరకు నిర్మించిన మూడు గోల్‌మాల్‌ సినిమాలూ విజయవంతమయ్యాయి. ఆంఖే-2 విషయానికొస్తే, ఇందులో అమితాబ్‌ బచ్చన్‌, అనిల్‌కపూర్‌, అర్జున్‌రాంఫాల్‌, ఇలియానా, రెజీనా ముఖ్య పాత్రలు పోషిస్తారు. అయితే ఇలియానా ఈ సినిమాలో నటించనుందంటూ నిర్మాతలు ప్రకటించడంపై ఆమె న్యాయ సలహా తీసుకుంటోంది. తనకు తెలియకుండా తన పేరు ప్రకటించడం ఇలియానాకు నచ్చలేదు. సన్నిహిత మిత్రులు ఆమెను అభినందించబోయినప్పుడు ఇలియానా ఆశ్చర్యానికి గురైంది. అందుకే ఇప్పుడు న్యాయపరమైన చర్యల కోసం ప్రయత్నిస్తోంది. ఇలియానా స్ధానంలో కత్రినాకైఫ్‌ వచ్చే అవకాశముంది. ఇందులో గుడ్డివాని పాత్ర ధరించబోయే నటుడి పేరును బాజ్మి తరవాత ప్రకటిస్తానని చెప్పారు. ఆంఖే తొలి సినిమా 2002లో వచ్చింది. అందులో ముగ్గురు అంధయువకులు ఒక బ్యాంక్‌ దోపిడీకి పాల్పడతారు. ఆంఖే-2 లో ఆ ముగ్గురు అంధ యువకులు ఒక జూదశాలలో దొంగతనానికి పాల్పడతారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com