సామజిక సేవ

ట్రాఫిక్‌ నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించేందుకు దిల్లీ పోలీసులు బాలీవుడ్‌ నటులు అనుష్క శర్మ, వరుణ్‌ ధావన్‌ సాయం కోరారు. వీరిద్దరూ జంటగా ‘సూయీ ధాగా- మేడ్‌ ఇన్‌ ఇండియా’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం దిల్లీలోని చాందినీ చౌక్‌, శంకర్‌ మార్కెట్ ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిందిగా పోలీసులు కోరారు. అయితే వీరిద్దరితో దిల్లీలో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలనుకున్నామని.. కానీ వారు బిజీగా ఉండటంతో ఓ వీడియో రూపొందించామని పోలీసులు తెలిపారు. వీడియోలో అనుష్క మాట్లాడుతూ..‘మన జాగ్రత్త కోసం దిల్లీ పోలీసులు చాలా కష్టపడుతుంటారు. జీవితం ఎంతో విలువైనది. ద్విచక్రవాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా హెల్మెట్లు పెట్టుకోవాలి’ అని పేర్కొన్నారు. ఈ వీడియోను దిల్లీ ట్రాఫిక్‌ పోలీసులు ట్విటర్‌లో విడుదల చేశారు. దిల్లీలో ఈ ఏడాది మార్చి 15 వరకూ 239 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 248 మంది మృత్యువాతపడ్డారు. 2016లో 1,548 రోడ్డు ప్రమాదాలు జరగ్గా అందులో 1,591 మంది చనిపోయినట్లు దిల్లీ ట్రాఫిక్‌ పోలీసు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దిల్లీ పోలీసులు వాహనదారులకు ప్రమాదాల గురించి వివరించేందుకు ఏదన్నా కొత్తగా చేయాలనుకున్నారు. ఎటూ చిత్రీకరణ నిమిత్తం అనుష్క, వరుణ్‌ దిల్లీలోనే ఉండటంతో పోలీసులు వారి చేత ఈ వీడియోను రూపొందించారు. ‘సూయీ ధాగా’ సినిమాకు శరత్‌ కటారియా దర్శకత్వం వహిస్తున్నారు. జాతిపిత మహాత్మాగాంధీ స్వదేశీ దుస్తులకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవారు. ఈ అంశాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమాను అక్టోబర్‌ 2న విడుదల చేయనున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com