సింధు గెలుపుకు నేనే కారణం-బాబు ఉద్ఘాటన

తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అప్పట్లో గోపీచంద్‌కు తాను అందించిన సహకారమే ఈరోజు దేశానికి ఒలింపిక్స్‌ పతకం తెచ్చిపెట్టిందన్నారు. క్రీడలను ప్రోత్సహిస్తే అత్యుత్తమ క్రీడాకారులు తయారవుతారన్నారు.విశాఖలో ఏర్పాటు చేసిన ఏపీ మెడిటెక్‌ జోన్‌ పెట్టుబడిదారుల సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…..సత్య నాదెళ్ల మైక్రోసాప్ట్‌కు సీఈవో అయ్యారంటే దానికి తానే కారణమని చెప్పి జనానికి షాక్ ఇచ్చిన చంద్రబాబు… ఇప్పుడు బాడ్మింటన్ క్రీడాకారిణి సింధును వదిలిపెట్టలేదు. ఆమె అహర్నిశలు కష్టపడి రియోలో రికార్డు సృష్టిస్తే దానికి తానే కారణమని చంద్రబాబు సెలవిచ్చారు. అప్పట్లో తాను సీఎంగా ఉన్నప్పుడు క్రీడలను ప్రోత్సహించడం వల్లే నేడు సింధు ఒలంపిక్స్‌లో పతకం సాధించగలిగిందని (చంద్రబాబు ఈ ప్రకటన విడుదల చేసే సమయానికి ఇంకా ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కాలేదు, పతకం అందుకోలేదు) చెప్పారు. గోపిచంద్ అకాడమీకి భూమి ఇచ్చింది తానేనన్నారు. అప్పుడు అలా చేయడం వల్లే ఇప్పుడు సింధు ఒలంపిక్స్ లో పతకం సాధించిందని చెప్పారు. చంద్రబాబు విశాఖలో ఈ కామెంట్స్ చేశారు. అయితే చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయకముందే కొందరు నెటిజన్లు… సింధుకు పతకం రావడం కూడా తన మహిమేనంటూ చంద్రబాబు ప్రచారం చేస్తారని సెటైర్లు వేశారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే సింధు పతకం ఖ్యాతిని చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో నెటిజన్ లు మరోసారి తమ పోస్టులకు పదును పెట్టారు. చంద్రబాబు ఎంత సీరియస్ గా చెప్పారో… నెటిజన్ అంతే కామెడీగా తీసుకొని సెటైర్లు వేస్తున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com