అమెరికాలో సినీనటుల చేత వ్యభిచారం చేయిస్తున్నందుకు మోదుగుముడి కిషన్ అరెస్టు

టాలీవుడ్‌లో మరో సెక్స్ స్కాండల్ వెలుగు చూసింది. సినిమా షూటింగ్‌ల పేరిట హీరోయిన్లను అమెరికా వంటి విదేశాలకు తీసుకెళ్లి వ్యభిచారం చేయిస్తున్న గుట్టురట్టయింది. ఈ స్కామ్‌లో నిర్వాహకులైన భార్యభర్తలను చికాగో పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి భారీ మొత్తంలో కండోమ్స్ ప్యాకెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగిస్తున్న ఈ సెక్స్ స్కాండల్ వివరాలను పరిశీలిస్తే.. టాలీవుడ్ హీరోయిన్స్‌ను సినిమా షూటింగులంటూ తాత్కాలిక వీసాపై అమెరికాకు పిలిపించి, వారిని ఖరీదైన హోటళ్లలో ఉంచి, విటులను పంపుతున్న వైనాన్ని అమెరికా పోలీసులు గుర్తించారు. ఈ స్కామ్‌ నిర్వాహకులుగా ఎన్నారై మోదుగుమూడి కిషన్ (34), ఆయన భార్య చంద్ర (31)గా యూఎస్ పోలీసులు గుర్తించారు.  వీరిద్దరూ కలిసి గత కొంతకాలంగా ఈ రాకెట్ నడిపిస్తున్నారనీ, హీరోయిన్లను డల్లాస్, న్యూజెర్సీ, వాషింగ్టన్, డెట్రాయిట్, లాస్ ఏంజిల్స్ తదితర ప్రాంతాల్లోని హోటళ్లకు పంపే కిషన్, చంద్రలు, వారివద్దకు కస్టమర్లను తీసుకెళ్లేవారని, స్వల్ప సమయం వారితో గడిపేందుకు విటుల నుంచి 3 వేల డాలర్స్ వసూలు చేసేవారనీ పోలీసులు వెల్లడించారు. దీంతో ఈ భార్యాభర్తలిద్దరినీ అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి మరిన్ని వివరాల కోసం వారివద్ద విచారణ జరుపుతున్నారు. ఎఫ్.బీ.ఐ అధికారులు పలు తెలుగు సంఘాల నాయకులను విచారించి వారి మహాసభలకు ఎవరికీ ఆహ్వాన పత్రికలూ అందించారో తెలుపవలసిందిగా కోరారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com