సినీ నిర్మాత అశ్వినీదత్ కుమార్తెలు అద్భుతంగా రాణిస్తున్నారు.

అశ్వినీదత్ అంటే ఈ తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఆయన నిన్నటి తరంలో ఒక బడా ప్రొడ్యుసర్ వైజయంతి మూవీస్ బ్యానర పేరు చెపితే ఎంత రేటయినా సరే.. డిస్త్రిబ్యుటర్లు సినిమాను కళ్ళు మూసుకుని కొనుగోలు చేసే వారు. తెలుగు సినిమా చరిత్రను తిరగరాసే విజయాలను అందించారాయన. గత కొన్నేళ్లుగా సారిన హిట్ లేక తేరా వెనక్కు వెళ్ళిపోయినా వైజయంతీ మూవీస్ ను మహానటీ లాంటి ఒక అద్భుతమైన సినిమా.. బలమైన ఫోర్స్ తో ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. అశ్వినీదత్ కు ముగ్గురు కుమార్తెలు ఈ జనరేషన్ లో అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే అనుకునే వారి సంఖ్యా బాగా పెరిగింది. కానీ మన తడ్న్రుల తరం దాకా కూడా అబ్బాయి కోసం నోములు వ్రతాలు చేసే వారు. బహుశా అశ్వినీదత్ దంపతులు కూడా తమకు ఒక కుమారుడు కావాలనీ కోరుకుని ఉంటారు. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, స్వప్న దత్, ప్రియాంకా దత్, స్రవంతి పెద్దమ్మాయి రాజుల అబ్బాయి ప్రసాద్ వరమని పెళ్లి చేసుకున్నారు. రెండో అమ్మాయి రెడ్ల అబ్బాయి నాగ అశ్విన్ ను పెళ్లి చేసుకుంది. మూడో అమ్మాయి స్రవంతి లండన్ లోని లీడ్స్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి హాస్పిటాలిటీ మేనేజ్ మెంట్ లో పట్టా అందుకున్నారు.
**ఒక పక్క కుమారుడు లేకపోవడం మరో వైపు తన ఇద్దరు కూతుళ్ళు కులాంతర వివాహం చేసుకోవడం అశ్వినీదత్ ను బాధ పెట్టి ఉంటుంది. అయితే సినిమా రంగంలో కులాంతర వివాహాలు కొత్తేమి కాదు. అందువల్లా అశ్వినీదత్ కూడా తన కూతుళ్ళ పెళ్ళిళ్ళను స్వాగతించారు. ఇప్పుడు అదే కూతుళ్ళు మహానటి సినిమా ద్వారా తెలుగు సినిమా రంగంలో మళ్ళీ తన పేరును నిలబెట్టారని ఆ తండ్రి ఎంతగానో సంతోషిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అశ్వినీదత్ గురించి ఒక వెబ్ సైట్ లో వహ్హిన వ్యాసం ఇంటరెస్టింగ్ గా ఉంది. ఆ వ్యాసం ఇదిగో..
**వైజయంతి మూవీస్ ను ఎన్టీఆర్ బొమ్మనే బ్యానర్ లోగోలో పీతుకుని ఆరంభించారు నిరమాత అశ్వినీదత్. గుండె ధైర్యం గల నిర్మాత అంటే గుర్తు వచ్చే పేరు ఆయనది. ఎన్నో సినిమాలు తీశారు. అందులో బ్లాక్ బ్లాస్టర్లు ఉన్నాయి. డిజాస్టర్లు ఉన్నాయి. అయినా వెనుకడుగు వేయలేదు. తను బ్లాక్ బస్టర్లు ఇచ్చిన హీరోలు ఎవరూ, డిజస్టర్లు వచ్చిన టైం లో ఆడుకున్నట్లూ కనిపించదు. అయినా చింతలేదు. ఆయనకు తగ్గ పిల్లలే.. స్వప్న ప్రియాంక పక్కా మొండి ఘట్టాలు. తండ్రి బాటలో కాకుండా చిన్న సినిమాలు, వైవిధ్యమైన సినిమాలు ప్రయత్నించడం ఆరంభించారు. అదృష్టం కలిసిరాలేదు. జనం వెనుకన వెక్కిరించారు. ఐరన్ లెగ్స్ అన్నారు. తండ్రి బ్యానర్ పరువు తీస్తున్నారన్నారు. అయినా పట్టించుకోలేదు. తమ సమకాలిన యువ సంచయంతో కలిసి ఎవడే సుబ్రహ్మణ్యం తీసి చూపించారు. ఆ తరువాత మూడేళ్ళ పాటు పాతిక కోట్ల ఖర్చును తలపై పెట్టుకుని, మహానటి బయోపిక్ తీశారు. తీయడం కాదు. అహరహం శ్రమించారు. నిర్మాతలుగా కాదు. దర్శకుడు నాగ్ అశ్విన్ కు కుడి ఎడమలుగా తాము ఓ టెక్నీషియన్లుగా పగలు, రాత్రీ తేడా లేకుండా సినిమా కోసం శ్రమించారు. దత్తు ఇంటి అల్లుడిగా మారిన నాగ్ అశ్విన్, ఆ ఇంటి ఆడపిల్లల ఆలోచనలకు మరింత బలమైన తోడయ్యారు. ముగ్గురు కలిసి త్రీమూర్తి స్వరూపంలో మహానటీ సావిత్రీ విశ్వరూపాన్ని చూపించారు.
**దాదాపు 27 కోట్ల వ్యయంతో ఎదురుగా కనిపిస్తున్నా భయపడలేదు. సినిమాను తెగ నమ్మలేదు. ఆఖరికి శాటిలైట్ డిజిటల్ కూడా చేయలేదు. ధైర్యంగా నేరుగా విడుదల చేశారు. అందిన కాటికి కాస్త అడ్వాన్స్లు తీసుకున్నారు. అంతే. దాదాపు పదిహేను కోట్లకు పైగా డేపినిట్. మూడు పదులకు కాస్త అటు ఇటు ఉన్న అమ్మాయిలకు ఇంత గట్స్ ఎక్కడి నుంచి వచ్చినట్లు? తండ్రి పోలిక అనుకోవాలా?
*సినిమా ప్రపంచంలో తమ సంబందాలు వాడుకుని మహానటికీ మాంచి బాజ్ తీసుకువచ్చారు. పబ్లిసిటీని ఖర్చుతో కన్నా, వైవిద్యంగా ప్లాన్ చేసారు. ఒక పక్కా ప్రణాళిక ప్రకారం విడుదల చేశారు. ఇప్పుడు జేజేలు అందుకుంటున్నారు. ఇది అశ్వినీదత్ ఆడబిడ్డలు అందుకున్న విజయం.
*బహుశా ఇవన్నీ తలుచునే కావచ్చు, అశ్వినీదత్ కళ్ళ వెంట కన్నీళ్లు వచ్చాయనీ దగ్గరి జనాలు చెబుతున్నారు. విడుదల ముందురోజు రాత్రీ సినిమాను ప్రత్యేకంగా వేసుకుని చూసిన తరువాత వచ్చిన ఫీడ్ బ్యాక్ కు ప్రశంసలకు అశ్వినీదత్ నోట మాట రాలేదు. కంట కన్నీళ్ళు తప్ప.
* జగదేక వీరుడు అతిలోక సుందరి విడుదల తేదీన విడుదల చేయాలన్న సెంటిమెంట్ మాటేమో కానీ ఆ సినిమా డబ్బులు తెస్తే ఈ సినిమా అంతకు పదింతలు పేరు తెచ్చింది. ఇది ఆ వెబ్ సైట్ లో వచ్చిన వ్యాసం క్లుప్తంగా అశ్వినీదత్ గురించి ఆయన కుమార్తెలు మహానటి కోసం పడిన శ్రమను దాని ఫలితాన్ని వివరించింది. మహానటి సినిమా నిజంగా అద్భుతం చేసింది. వైజయంతీ మూవీస్ బ్యానర్ ను మళ్ళీ ఈ తరానికి పరిచయం చేసింది. 1974లో ఎన్టీఅర్ ఈ బ్యానర్ ను ప్రారంభించారు. ఎదురులేని మనిషీ అనే సినిమాతో తన ప్రస్తానం ప్రారంభించిన వైజయంతీ మూవీస్ ఈరోజున మహానటీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఎన్టీఆర్ . ఏఎన్నార్, కృష్ణా, శోభన్ బాబు , చిరంజీవి, బాలకృష్ణ, కృష్ణం రాజు లాంటి వెనుకటి తరం హీరోలతో పటు మహేష్ బాబు , జూనియర్ ఎన్టీఆర్, అలలు అర్జున్ , రామ్ చరణ్ , నారారోహిత్ లాంటి వారందరితో అశ్వినీదత్ సినిమాలు తీశారు. అగ్నిపర్వతం , జగదేక వీరుడు అతిలోక సుందరి, ఇంద్ర లాంటి సినిమాలు టాలీవుడ్ రికార్డులను తిరగరాశాయి. రెండో అమ్మాయి ప్రియాంకా త్రీ ఏంజిల్స్ స్టూడియోను నెలకొల్పారు. బాణం సినిమాను ఈ స్టూడియోనే తీసింది. పెద్ద అమ్మాయి తన పేరు మీదుగానే స్వప్న సినిమా అనే బ్యానర్ ను నెలకొల్పారు. ప్రియాంకా కూడా తన అక్కకు తోడుగా నిలిచింది. ఇద్దరూ కలిసి ఎవడె సుబ్రహ్మణ్యం అనే సినిమాను తీశారు. ఇది హిట్ కొట్టింది. ఆ తరువాత ఇప్పుడు మహానటి సినిమాను తీశారు. అప్పటికి ఇప్పటికీ తెలుగు సినిమా తెర మీద లెజండరీ యాక్ట్రెస్ గా తెలుగు సినిమా తెర మీద లెజెండరీ యాక్ట్రెస్ గా నిలిచినా సావిత్రీ జీవితాన్ని ఆవిష్కరించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ముప్పై కోట్ల రూపాయలకు పైగా సినిమా వసూళ్లు సాధించింది. కలెక్షన్లు కాకుండా శాటిలైట్ డిజిటల్ రైట్స్ ద్వారా పద్దెనిమిది కోట్ల రూపాయలను వసూలు చేసింది. పెట్టుబడి కంటే రెట్టింపు ఆదాయాన్ని రాబట్టింది. డబ్బు కంటే కూడా ఈ సినిమా తెచ్చిన పేరు అశ్వినీదత్ కు జీవితానికి సరిపడ ఆనందాన్నిస్తుంది.
*స్వప్న 1981 ఆగస్టు 30న విజయవాడలో జన్మించారు. 18 ఏళ్లకే సినిమా రంగంలోకి వచ్చారు. అమెరికాలోని ఒహోయో యూనివెర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు. హైదరాబాద్ లో లోకల్ చానెల్ ను ప్రారంభించారు. కానీ అది ఆశించిన స్థాయిలో సక్సెస్ ను అందుకులేదు. అయితే తెలుగు ఎంటర్ టైన్ మెంట్ చానెల్స్ లో ప్రసారమైన పలు కార్యక్రమాలుకు ఆమె నిర్మాతగా వ్యవహరించారు.
**ప్రియాంకా దత్ 1984 డిసెంబరు 19న జన్మించారు. లాస్ ఏంజిల్స్ లోని యూనివెర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి ఫిల్మ్ మేకింగ్ లో డిగ్రీ అందుకున్నారు. 21 ఏళ్ల వయసులో బాలు అనే సినిమాకు సహా నిర్మాతగా వ్యవహరించారు. త్రీ ఏంజిల్స్ స్టూడియో బ్యానర్ పైన ప్రీమియం క్లయింట్లకు కార్పోరేట్ ఫిల్సం ను కూడా తీశారు. అశ్వినీదత్ కుటుంబానికి , త్రిపురనేని హనుమాన్ చౌదరీ కుటుంబానికి మధ్య దగ్గరి బంధుత్వం ఉంది. పద్మశ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరీ అశ్వినీదత్ తోడల్లుడు, అశ్వినీదత్ తండ్రి పేరు ధర్మరాజు సతీమణీ పేరు దోనేపూడి ఈశ్వర వెంకటేశ్వర్లు. ఈయన విజయవాడలో ఒకప్పుడు ఐకానిక్ ధియోటర్ గా ఉన్న జైహింద్ టాకీస్ ఓనర్. అశ్వినీదత్ స్వస్థలం విజయవాడ కాగా.. వెంకటేశ్వర్లు స్వస్థలం కృష్ణాజిల్లా చల్లపల్లి దగ్గరున్న దేవరకోట.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com