సిరియాపై జరిపిన వైమానిక దాడుల్లో చాలా వరకు రసాయన ఆయుధాలు ధ్వంసమయ్యాయని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ వైవ్స్ వెల్లడించారు. సిరియా అధ్యక్షుడు అసద్ ఇటీవల చేపట్టిన రసాయన దాడులకు వ్యతిరేకంగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సంయుక్త దళాలు శుక్రవారం రాత్రి వైమానిక దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. సిరియా ప్రభుత్వం నిల్వ చేసిన రసాయన ఆయుధాగారాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. అయితే ప్రభుత్వం నిల్వ ఉంచిన రసాయన ఆయుధాల్లో పెద్ద మొత్తాన్ని ధ్వంసం చేసినట్లు ఫ్రాన్స్ మంత్రి తెలిపారు. గత రాత్రి జరిగిన దాడుల్లో చాలా వరకు అవి నాశనమైపోయాయని చెప్పారు.