సిలికానాంధ్ర “సంపద” విద్యార్థులకు పరీక్షలు

అమెరికా, కెనడాల్లో సంగీతం, నాట్యం వంటి కళల్లో శిక్షణ పొందుతున్న సిలికానాంధ్ర ‘సంపద’ (Silicon Andhra Music, Performing Arts & Dance Academy) విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు.. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు నిర్దేశించిన పాఠ్యప్రణాళిక ప్రకారం కర్ణాటక సంగీతంలో గాత్రం, వయోలిన్, వీణ, వేణువు(ఫ్లూట్), మృదంగం, హిందుస్తానీ సంగీతంలో గాత్రం, వయొలిన్, సితార్, ఫ్లూట్, తబల, భారతీయ నాట్యాలలో భరతనాట్యం, కూచిపూడి, ఆంధ్ర నాట్యం తదితర కోర్సులలో , తొలిదశ (2సం) ద్వారా జూనియర్ సర్టిఫికేట్, మలిదశ (2సం) ద్వారా సీనియర్ సర్టిఫికేట్ పొందుతారు. మొదటి సంవత్సరమే సంపద లో 800 మంది విద్యార్ధులు నమోదు చేసుకోవడం ఎంతో సంతోషం కలిగిస్తోందని, ఈ విద్యాసంవత్సరాంతపు పరీక్షలను మే5, 6 తేదీల్లో 600కు పైగా విద్యార్ధులకు వివిధ ప్రాంతాలలో నిర్వహించడంతో పాటు, ఆన్ లైన్ ద్వారా కూడా ఈ పరీక్షలను నిర్వహించామని, సిలికానాంధ్ర సంపద అధ్యక్షులు దీనబాబు కొండుభట్ల తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణలో అమెరికావ్యాప్తంగా ఉన్న ఎంతో మంది సిలికానాంధ్ర సాంస్కృతిక సైనికులు సహకారం అందించారని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. 2018-19 విద్యాసంవత్సరపు ప్రవేశాలు మే 15న ప్రారంభమౌతున్నాయని, సంపద గురించిన మరిన్ని వివరాలకు, కొత్త విద్యాసంవత్సరంలో నమోదు కొరకు http://sampada.siliconandhra.org సంప్రదించవచ్చని దీనబాబు తెలిపారు.








More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com