సీరియల్ ఆగిపోయింది

తెలుగులో ‘కొత్త బంగారులోకం’ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి శ్వేతా బసు ప్రసాద్‌. ఆ తర్వాత ‘కళావర్‌ కింగ్‌’ చిత్రంతో నటించారు కానీ టాలీవుడ్‌లో ఆమెకు ఆశించినంత స్థాయిలో గుర్తింపు రాలేదు. ఆ తర్వాత పలు బాలీవుడ్‌ చిత్రాల్లోనూ నటించారు. సినిమా అవకాశాలు లేకపోవడంతో హిందీలో వచ్చిన ‘చంద్ర నందిని’ అనే ధారావాహికలో నటించారు. ఈ సీరియల్‌ గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా శ్వేత ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగపు పోస్ట్‌ పెట్టారు. ‘ప్రతి ప్రయాణానికీ ముగింపు ఉంటుంది. అలాగే ‘చంద్ర నందిని’ కూడా ముగిసింది. ఎంత బాధగా ఉందో చెప్పడానికి మాటలు రావడంలేదు. ఈ సీరియల్‌లో నటించే అవకాశం ఇచ్చినందుకు నిర్మాత ఏక్తా కపూర్‌కి ధన్యవాదాలు. నా తోటి నటీనటులకు, ప్రొడక్షన్‌ బృందానికి కూడా ధన్యవాదాలు. రేపటి నుంచి చిత్రీకరణ కోసం స్టూడియోకి వెళ్లే పనిలేదు అని గుర్తొచ్చినప్పుడల్లా గుండెపగిలిపోతోంది. నన్ను ఇంతలా ఆదరించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ ధారావాహికలో నేను పోషించిన మహారాణి నందిని పాత్రను నేను ఎప్పటికీ మర్చిపోలేను’ అని పేర్కొన్నారు శ్వేత.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com