సుగంధ ద్రవ్యాలతో చాలా లాభాలు

మనం సుగంధ ద్రవ్యాలుగా పిలుచుకునేవాటిలో, ఇంట్లో మనం వాడే రకరకాల పదార్థాల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అవేంటో చూస్తే..
* పసుపు
పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలున్నాయి. పసుపులో ఉండే కర్క్యుమిన్‌ కేన్సర్‌ను నిరోధిస్తుంది. అయితే, మార్కెట్లో దొరికే పసుపును కాక.. కొమ్ములు పట్టించుకుని తెచ్చుకున్న పసుపును వాడుకోవడం ఉత్తమం.
*మిరియాలు
రుచికి ఘాటుగా ఉన్నా ఇవి చేసే మేలు అంతా ఇంతా కాదు. రోగనిరోధక శక్తి పెంచడంలో, రక్తప్రసరణ క్రమబద్ధీకరించడంలో, కొవ్వును తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
*వాము
అజీర్తి, గ్యాస్ట్రిక్‌ సమస్యల పరిష్కారానికి వాము ఎంతగానో ఉపయోగపడుతుంది. వాము వేయించే సమయంలో వచ్చే వాసన పీల్చడం వల్ల కఫం బయటకు వస్తుంది.
*లవంగాలు
దంతాలు, చిగుళ్ల సమస్యల పరిష్కారంలో లవంగాలు ఎంతగానో ఉపకరిస్తాయి.
*ఇంగువ
జీర్ణశక్తికి ఇంగువ ఉపకరిస్తుంది.
*యాలకులు
నోటి దుర్వాసనను పోగొట్టడంలో యాలకులు ఉపయోగపడతాయి.
*వెల్లుల్లి
రోగనిరోధకశక్తిని పెంచడంలో వెల్లుల్లి తర్వాతే ఏ పదార్థమైనా. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్‌ ఇన్ఫెక్షన్లను, సూక్ష్మజీవులను ఎదుర్కొనే తెల్లరక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది.
*మెంతులు
మధుమేహాన్ని తగ్గించడంలో మెంతులు ఎంతగానో ఉపయోగపడతాయి.
*తులసి
కడుపులో క్రిములను పారద్రోలే శక్తి తులసికి ఉంది. సాధారణ జ్వరాలకు తులసి ఆకుల కషాయం చక్కటి మందు.
*వేప
మన పెరట్లో ఉండే వేప ఆకులు, పువ్వులు, కాయలు, బెరడు.. అన్నీ ఔషధ గుణాల మయం. వేప బెరడుకు యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలుంటాయి. ఆయుర్వేద మందుల్లోనూ వేప ఆకులను వినియోగిస్తారు.
..వీటిని పాటించడం ద్వారా చాలా వరకూ అనారోగ్య సమస్యలు దరిచేరవు. అయితే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు వంటింటి చిట్కాలకు మాత్రమే పరిమితం కాకూడదు. రెండు-మూడు రోజులైనా తగ్గకపోతే వైద్యులను తప్పక సంప్రదించాలి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com