సుర్రుమనేలా చురకలు

టీమిండియా క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ దిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యులు బిషన్‌సింగ్‌ బేడీ, చేతన్‌ చౌహాన్‌లకు చురకలంటించాడు. గురువారం నుంచి భారత్‌-అఫ్గాన్‌ మధ్య ఏకైక టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లు సోమవారం యో యో టెస్టులో పాల్గొన్నారు. ఇందులో సీనియర్‌ ఫాస్ట్‌ బౌలర్‌ మహమ్మద్‌ ఫెయిలవ్వడంతో అతని స్థానంలో నవదీప్‌ సైనీని భారత జట్టులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. నవదీప్‌ సైని హరియాణాకు చెందిన వాడు. రంజీ ట్రోఫీలో నవదీప్‌ దిల్లీకి ప్రాతినిధ్యం వహించాడు. ఇందుకు గంభీరే కారణం. నవదీప్‌ బౌలింగ్‌లో ప్రాక్టీస్‌ చేసిన గంభీర్‌.. అతని బౌలింగ్‌లో ఏదో మాయ ఉందని గమనించి దిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యులు బేడీ, చౌహాన్‌ వద్దకు వెళ్లి నవదీప్‌ను రంజీ ట్రోఫీలో దిల్లీకి ప్రాతినిధ్యం వహించేలా చేయాలని సూచించాడు. వారేమో అతడు దిల్లీ వాడు కాదు కదా! అని ఏవేవో కారణాలు చూపారు. అక్కడితో గంభీర్‌ ఊరుకోలేదు. వారిద్దరిపై ఒత్తిడి తీసుకువచ్చి నవదీప్‌కు దిల్లీ జట్టులో చోటు దక్కేలా చేశాడు. ఆ సీజన్‌లో ఎనిమిది మ్యాచ్‌లాడిని నవదీప్‌ 34 వికెట్లు తీసి దిల్లీ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ ప్రతిభ ఆధారంగానే నవదీప్‌ ఇప్పుడు భారత జట్టులోకి వచ్చాడు. నవదీప్‌ భారత జట్టుకు ఎంపికైన అనంతరం గంభీర్‌ ట్విటర్‌ వేదికగా స్పందించాడు. బేడీ, చౌహాన్‌కు చురకలంటించాడు. ‘డీడీసీఏ సభ్యులు బిషన్‌సింగ్‌ బేడీ, చేతన్‌ చౌహాన్‌కు నా సంతాపం తెలుపుతున్నాను. గతంలో నవదీప్‌ను దిల్లీకి ఆడించాలని కోరితే బయటివాడు అన్నారు. ఇప్పుడు అతడే భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. బెంగళూరులోనూ నలుపు రంగు చేతి బ్యాండ్లు దొరుకుతాయి. రూ.225కు ఒక రోల్ దొరుకుతుంది. అన్నింటి కంటే ముందు నవదీప్‌ భారతీయుడు అని గుర్తించండి. ఆ తర్వాతే ఎక్కడ నుంచి వచ్చాడన్నది’ అని గంభీర్‌ పేర్కొన్నాడు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com