సువాసన రహస్యం అది

అమ్మ పొద్దున్నే పూజ చేసి అగర్‌బత్తీలు వెలిగించేస్తుంది… గుబాళించే వాటి సువాసనలు మనకు పరిచయమే… మరి అవి ఎలా తయారవుతాయో తెలుసా?
దేవుడి ఆరాధనలో దీపాలతో పాటు అగర్‌బత్తీలూ తప్పనిసరే. వాటిల్లో బోలెడు రకాలు… బోలెడు ఘుమఘుమలు. మరి ఆ వాసనలు ఎక్కడి నుంచి వస్తాయి? అసలు అగర్‌బత్తీలు ఎలా వస్తాయి?
* ప్రాంతాన్ని బట్టి రకరకాల పద్ధతులుంటాయి వీటిలో. కొన్నిప్రదేశాల్లో మనుషులే తయారు చేస్తే… మరి కొన్నిచోట్ల యంత్రాల ద్వారా చేస్తుంటారు.
* ఎలా చేసినా ముడి సరుకు మాత్రం ఒకటే. చేసే విధానంలోనే చిన్న చిన్న మార్పులుంటాయి.
* వెదురు కర్రలు తెలుసుగా. వాటినే యంత్రాల ద్వారా చీపురుపుల్లంత సన్నగా మారుస్తారు.
* ఇప్పుడు చార్‌కోల్‌ పొడి (కర్రను కాల్చి చేసిన బొగ్గు పొడి), జిగట పొడి (వుడ్‌ గ్లూ), రంపపు పొట్టు, గంధపు చెక్కపొడి కలిపి కొంచెం నీళ్లు కలుపుతూ ముద్దలా చేస్తారు. ఈ పొడులన్నీ విడిగా బయట అంగట్లో దొరికేవే.
* కొంత మంది గంధపు చెక్కపొడి వేయకుండా పరిమళాలు వెదజల్లే నూనెల్నీ ఉపయోగిస్తారు.
* పైన తయారు చేసుకున్న మిశ్రమాన్ని అగర్‌బత్తీ తయారీ యంత్రంలో వేస్తారు. దీనికి కిందన ప్రత్యేకంగా పుల్లల్ని పంపించే విధానం ఉంటుంది. దాని ద్వారా సిద్ధంగా ఉంచుకున్న కర్రపుల్లల్ని పంపిస్తే… పై నుంచి వేసిన మిశ్రమం ఒక్కో పుల్లకు చుట్టుకుని బయటకు వస్తుంది.
* ఇంకేముంది… వీటిని పరిమళాల్లో ప్రత్యేకంగా ముంచుతారు.
* ఆ తర్వాత ఆరబెట్టి ప్యాకింగ్‌ చేసేస్తారు. దుకాణాలకు పంపేస్తారు. వాటినే మనం కొని తెచ్చిపెట్టుకుంటాం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com