సూర్య నమస్కారం ఆధ్యాత్మికం కాదు…ఆరోగ్యం

ఉదయాన్నే సూర్యుడికి నమస్కరించడం అనేది ఇప్పటిది కాదు… ప్రాచీనకాలం నుంచి ఉంది. మన పూర్వీకులు నిత్యం సూర్యుడిని నమస్కరించేవాళ్లు. ఉదయాన్నే మొదట చేసే పని ఇదే. రానురాను.. సూర్యనమస్కారంపై అవగాహన తగ్గిపోయింది. ప్రస్తుత జనరేషన్ కు సూర్యనమస్కారం చేయడానికి తీరిక లేదు.. ఓపికా లేదు.

సర్వరోగాలకు సూర్య నమస్కారం ఒక్కటి చాలు. జీవితం ఆరోగ్యంగా సాగిపోతుంది భారతీయుల జీవనశైలిలో యోగాకు ప్రత్యేక స్థానముంది. అందులో సూర్యనమస్కారానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. శరీర ఆరోగ్యానికి, మేధస్సుకు సూర్య నమస్కారం సహకరిస్తుందని భారతీయుల నమ్మకం. అంతేకాదు సూర్యుడిని శక్తివంతమైన దేవుడిగా భావిస్తూ.. పూజించడం భారతీయులకు పురాతన కాలం నుంచే అలవాటుగా ఉంది.

సూర్యనమస్కారం చేయడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

చర్మం, శరీర ఆరోగ్యం వరకు అన్నింటికీ సూర్యనమస్కారం మంచి పరిష్కారం. ఉదయాన్నే సూర్యనమస్కారంతో రోజుని ప్రారంభిస్తే కనిపించే మార్పే వేరు. సూర్యనమస్కారం ఇంపార్టెంట్ అని చెప్పడానికి చాలా కారణాలున్నాయి.

బరువు తగ్గడానికి
సూర్యనమస్కారం చేయడం వల్ల బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ సూర్యనమస్కారం చేసే పద్ధతి వల్ల పొట్టభాగంలో కండరాలపై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల బెల్లీ ఫ్యాట్ ఈజీగా తగ్గుతుంది. అలాగే మెటబాలిజం స్థాయి పెరగడానికి కూడా సూర్యనమస్కారం సహాయపడుతుంది.

జుట్టుకి
రెగ్యులర్ గా సూర్య నమస్కారం చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి.. జుట్టు రాలడాన్ని, జుట్టు తెల్లబడటాన్ని, చుండ్రుని అరికడుతుంది. అలాగే జుట్టు పెరుగుదలకు కూడా సూర్యనమస్కారం వల్ల సాధ్యమవుతుంది.

కండరాలు, కీళ్లకు
సూర్యనమస్కారం కండరాలు, కీళ్ల బలపడటానికి సహాయపడుతుంది. సూర్యనమస్కారం చేసేటప్పుడు వచ్చే కదలికలు.. వెన్నెముక ఆరోగ్యానికి కూడా మంచిది. అలాగే అంతర్గత అవయవాల పనితీరు ఉత్సాహవంతంగా మారడానికి కూడా సూర్యనమస్కారం ద్వారా సాధ్యమవుతుంది.

కాంతివంతమైన చర్మానికి
సూర్యనమస్కారం రక్తప్రసరణను ఇంప్రూవ్ చేయడం వల్ల మీ చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అలాగే చర్మంపై ముడతలు అరికడుతూ.. ఏజ్ లెస్ లుక్ ని అందిస్తుంది.

ఫ్లెక్సిబుల్
సూర్యనమస్కారం మీ శరీరాన్ని ఫ్లెక్సిబుల్ గా మారుస్తుంది. రెగ్యులర్ సూర్యనమస్కారం చేస్తే.. వెన్నెముక, ఇతర అవయవాలు ఆరోగ్యంగా, ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి.

జీర్ణవ్యవస్థ
డైజెస్టివ్ సిస్టమ్ స్మూత్ గా పనిచేయడానికి సూర్య నమస్కారం చక్కటి పరిష్కారం. చాలామందిని వేధించే గ్యాస్ర్టిక్ సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు.

మెదడుకి ఉపశమనం
సూర్యనమస్కారం చేస్తూ ఉంటే.. నిద్రలేమి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ ఆసనాలు మీకు ప్రశాంతతను, మంచి నిద్రకు తోడ్పడతాయి. ఒత్తిడిని కూడా తగ్గించుకోవచ్చు.

బెల్లీ ఫ్యాట్
నిత్యం సూర్య నమస్కారం చేయడం వల్ల మీ బెల్లీ ఫ్యాట్ ని తగ్గించుకోవచ్చు. అలాగే పొట్టభాగంలో ఉండే కండరాలను పెంచుతాయి. కాబట్టి సూర్యనమస్కారం అనవసరంగా పెరిగే బెల్లీ ఫ్యాట్ ని తగ్గిస్తుంది.

రుతుక్రమ సమస్యలు
సూర్యనమస్కారం మహిళల్లో వచ్చే ఇర్రెగ్యులర్ మెనుస్ర్టియల్ సైకిల్ సమస్యను తగ్గిస్తుంది. సరైన సమయంలో క్రమంగా రావడానికి ఇది సహాయపడుతుంది. అలాగే నిత్యం సూర్యనమస్కారం చేయడం వల్ల ఈజీగా డెలివరీ కూడా అవుతుంది.

బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించడానికి
అధ్యయనాల ప్రకారం సూర్య నమస్కారం చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గగిపోతాయి. దీనివల్ల గుండె సంబంధింత వ్యాధులు దూరంగా ఉంటాయి.

ఆందోళన
సూర్యనమస్కారం మెమరీ పవర్, నరాల వ్యవస్థ సరైన పద్ధతిలో పనిచేయడానికి సహకరిస్తుంది. అలాగే ఆందోళన తగ్గించి ప్రశాంతంగా ఉండటానికి తోడ్పడుతుంది. థైరాయిడ్ గ్లాండ్ కూడా యాక్టివ్ గా ఉంటడానికి సూర్యనమస్కారం పరిష్కారం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com